ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ ను సీఎం కేసీఆర్ విస్తరించారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చేతుల మీదుగా ఆరుగురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా హరీష్ రావు - కేటీఆర్ లు ఇద్దరూ ఒకేకారులో రావడం.. ఒక సీట్లో పక్కపక్కనే కూర్చోవడం తెలంగాణ రాష్ట్రసమితి నేతలు - శ్రేణులను ఉత్సాహపరిచింది. వారికి వేదిక కింద శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇక మంత్రివర్గ విస్తరణలో తొలుత హరీష్ రావు మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ చేశారు. తర్వాత వరుసగా సబితా ఇంద్రారెడ్డి - గంగుల కమలాకర్ - పువ్వాడ అజయ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఇక హరీష్ - కేటీఆర్ లు మంత్రులుగా ప్రమాణం చేయడానికి వచ్చిన సందర్భంగా ఈలలు, అరుపులు, కేరింతలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది.
తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు - ఇద్దరు వెలమలు - ఒక కమ్మ - ఒక బీసీ కాపు - ఒక ఎస్టీకి కొత్తగా చోటు దక్కింది. గ్రూప్ ఫొటో సందర్బంగా మంత్రులను గవర్నర్ సౌందరరాజన్ కు కేసీఆర్ ఒక్కరొక్కరిగా పరిచయం చేశారు.