రాష్ర్టపతి పదవికి తెలంగాణవాసి పోటీ

Update: 2017-06-15 07:46 GMT
రాష్ర్టపతి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పాలక - విపక్ష కూటములు ఇంకా అభ్యర్థుల ఎంపికనే పూర్తి చేయలేకపోయాయి. పెద్ద పార్టీల మద్దతు లేకుండా ఎవరూ రాష్ర్టపతి కాలేరు. అయినా... కొందరు మాత్రం తొలిరోజే నామినేషన్లు వేశారు. అందులో తెలుగు వ్యక్తి ఒకరు ఉండడం విశేషం.
    
రాష్ర్టపతి ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో తొలి రోజు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారు. తెలంగాణకు చెందిన ఎ.బాలరాజ్ అనే వ్యక్తి దేశ అత్యున్నత పదవికి పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
    
కాగా ఆయనతో పాటు మహారాష్ట్ర నుంచి ముగ్గురు ఉన్నారు. ముంబయికి చెందిన మహ్మద్ పటేల్ అబ్దుల్ హమీద్ - సైరాబానో మహ్మద్ పటేల్ లు.. పుణె నుంచి కొండేకర్ విజయ్ ప్రకాశ్ అనేవారు నామినేషన్లు వేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఆనంద్ సింగ్ కుశ్వాహ - తమిళనాడుకు చెందిన కె.పద్మరాజన్ లూ నామినేషన్లు వేశారు.     కాగా ఇందులో నలుగురు డిపాజిట్ మొత్తం అయిన రూ.15 వేలు చెల్లించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News