బాబు కోసం మరో ఆరు కొత్త కార్లు

Update: 2016-06-13 05:01 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఖర్చు విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. వీటిల్లో కొన్ని అంశాల మీద జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. మొత్తంగా చూస్తే.. ఏపీ సీఎంగా చంద్రబాబు ఖర్చు భారీగా ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ తరహా ఇమేజ్ ఆయనకు ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నా.. ఆయన తన వైఖరిని మార్చుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి.

మామూలుగా అయితే.. సీఎం స్థాయివ్యక్తి కోసం చేసే ఖర్చును పెద్దగా లెక్కలోకి తీసుకోరు. అయితే.. విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ సర్కారుకు బాబు పెడుతున్న ఖర్చులు ఇప్పుడు కొత్త భారంగా మారినట్లుగా పలు విమర్శలు వస్తున్నాయి. అయితే.. తన ఖర్చుల్ని తప్పుపడుతున్న తీరు సరికాదంటూ ఆయన తనను తాను సమర్థించుకోవటం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఖర్చు ఏపీ సర్కారు చేపట్టింది. ఈ ఖర్చు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించినది కావటం గమనార్హం.

ప్రస్తుతం ఆయన వినియోగిస్తున్న కార్లకు అదనంగా మరో ఆరు వాహనాల్ని కొనుగోలు చేశారు.  ప్రస్తుతం ఆయన కాన్వాయ్ లో చంద్రబాబు ప్రయాణించే కారుతో పాటు మరో ఏడు ఉంటాయి. వాటి వెనుక అంబులెన్స్.. ఇతర ఉన్నతాధికారుల వాహనాలు ఉంటాయి. ఇక.. కొత్తగా కొన్న కార్లు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వాడనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం వాడుతున్న కార్లు బ్లాక్ కలర్ లో ఉండతగా .. కొత్తగా కొన్న కార్లు మాత్రం తెలుపు రంగులో ఉన్నవి కావటం గమనార్హం. కొత్త కార్లు సరే.. కార్ల రంగు మారటానికి కారణం ఏమైనా ఉంది..?
Tags:    

Similar News