మన అవసరానికి తగ్గట్టుగా వాహనాలను మార్చుకుంటూ వస్తున్నాము. ఈ క్రమంలోనే ముందుగా ఎడ్ల బండితో ప్రారంభించడంతో మొదలుకుని మనము అంతరిక్షంలో జెండా పాతేందుకు అవసరమైన వాహక నౌకల వరకు తయారు చేసుకుంటూ వచ్చాము. అనంతరం సైకిల్ స్కూటర్ కార్ ఇలాంటి వాహనాలను రూపొందించుకున్నాము. వీటిలో కూడా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ వస్తున్నాము. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి తీసుకు వచ్చాము. అయితే ఇలాంటి ఓ సంకల్పం తోనే అమెరికాకు చెందిన ఓ ఆటోమొబైల్ సంస్థ ఓ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. దీనిని రూపొందించడానికి ఆ సంస్థ సుమారు మూడు మిలియన్ల అమెరికా డాలర్ లను ఖర్చు చేయనుంది.
భారత కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు 22 కోట్లకు పైగా ఉంటుంది. ఈ కారును ప్రపంచంలోనే అత్యున్నత వాహనశ్రేణి లో నిలబెట్టాలని కంపెనీ యోచిస్తోంది. దీన్ని కూడా ఇతర వాహనాలకు ఎక్కడ తీసిపోకుండా హైపర్ స్పీడ్ తో నడిచే విధంగా రూపొందిస్తోంది. కంపెనీ విడుదల చేసిన నమూనాల ప్రకారం ఈ వాహనం చూసేందుకు అంతరిక్షానికి వెళ్లే వాహక నౌక ఉంటుంది. అన్ని కార్లలా కాకుండా దీనిలో ప్రత్యేకంగా ఆరు చక్రాలు ఉంటాయి. ఈ ఆరు చక్రాలతో కారు మరింత వేగంగా నడిచేందుకు వీలుంటుందని ఈ ఆటోమొబైల్ సంస్థ పేర్కొంది. ఇందుకు తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ ప్రోపోషనల్ మోటర్లను ఇందులో అమర్చింది. ఈ సంస్థ పేరే హెన్నెస్సీ.
ఈ కారులో ఉండే మరొక ప్రత్యేకత ఏమిటంటే లోపల సీటింగ్ అంతా చార్టెడ్ ఫ్లైట్ లో ఉన్నట్లుగా రిచ్ లుక్ లో ఉంటుంది. డ్రైవర్ సీట్ కూడాను అని కారులో లాగా కాకుండా మధ్య భాగంలో ఉంటుంది. ప్రతి సీటు కూడా పడుకోవడానికి వీలుగా ఉండేలా వెనుకభాగం అందుకు తగ్గట్టుగా అమర్చారు. ఈ కార్ల తయారీకి ఒక కోడ్ ను పేరుగా పెట్టింది ఆ సంస్థ. అదే ప్రాజెక్ట్ డీప్ సీ. ఈ ప్రాజెక్ట్ డీప్ సీ లో కారు భాగం అంతా... కార్బన్ పైబర్ లో తయారు చేయనున్నారు. కేవలం అతి తక్కువ సంఖ్యలో ఈ కార్లను ఉత్పత్తి చేస్తోంది ఈ సంస్థ అయితే ఈ కార్ల విషయంలో సంస్థ వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా వీటిని రూపొందిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వాహనానికి సంబంధించి పూర్తి వివరాలను ఫీచర్స్ లను వెల్లడించడానికి సంస్థ విముఖత వ్యక్తం చేసింది. పూర్తిస్థాయిలో ఈ కారు అందుబాటులోకి తెచ్చిన తరువాత మిగతా వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది.
ప్రస్తుత ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కారు రెండువేల హార్స్ పవర్ కు సమానంగా ఉంటుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అంటే దీని వేగం గంటకు సుమారుగా 300 కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ కార్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలి అంటే 2026 వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. అయితే సంస్థ ప్రతినిధులు చెప్పినదాని ప్రకారం కేవలం 110 కంటే తక్కువ కార్ల ను మార్కెట్ లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు చెప్పారు.