జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఛలోరే ఛలోరే ఛల్ పేరిట తెలంగాణలో కొనసాగిస్తున్న యాత్రకు భారీగా స్పందన వస్తున్నా... యాత్ర సాగుతున్న కొద్దీ విమర్శల జడివాన కూడా ఎక్కువైపోతోందన్న వాదన వినిపిస్తోంది. మొన్న కరీంనగర్ జిల్లా పరిధిలోని కొండగట్టు అంజన్న గుడి సాక్షిగా ప్రారంభమైన ఈ యాత్ర నేటి ఉదయం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కాసేపటి క్రితం ప్రజలనుద్దేశించి మాట్లాడిన పవన్... కాస్తంత భావోద్వేగపూరితంగానే మాట్లాడారు. జై తెలంగాణ నినాదంతో కొనసాగుతున్న పవన్ స్పీచ్‌కు తెలంగాణలో భారీగానే చప్పట్లు పలుకుతున్నాయి. అదే సమయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ అవగాహనారాహిత్యంతో కూడుకున్నవేనని, ఈ తరహా పొలిటీషియన్ల వల్ల ప్రజలకేమీ ఉపయోగం లేదన్న కోణంలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రసంగంలో చాలా అంశాలను ప్రస్తావించిన పవన్... తెలంగాణలో తనపై దాడి జరిగినా కూడా స్వీకరిస్తానని, అయితే తనను తెలంగాణ జనం ఆదరిస్తారనే అనుకుంటున్నానని పేర్కొన్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు పేరును ప్రస్తావించిన పవన్... వీహెచ్ కలిసి వస్తే తెలంగాణలోని పల్లెల్లో ఇంటింటికీ తిరుగుతానని, దానికి వీహెచ్ సిద్ధమేనా? అని కూడా ప్రశ్నించారు. ఇంతదాకా బాగానే ఉన్నా... పవన్ నోట నుంచి దాడి మాట వినపడిందో, లేదో ఆయనపై ఏకంగా దాడి జరిగిపోయింది. ఖమ్మం పట్టణానికి సమీపంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్... తనపై దాడి జరిగినా చిరునవ్వుతోనే స్వీకరిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ప్రసంగాన్ని ముగిస్తూ జై తెలంగాణ నినాదాన్ని కూడా వినిపించారు. తదనంతరం ఆయన ఖమ్మం పట్టణంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన కారుపైకి ఓ చెప్పు బాణంలా దూసుకువచ్చింది.
పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే ఆ చెప్పు నేరుగా వచ్చి పవన్ కారుపై పడిపోయింది. పవన్‌కు ఖమ్మంలోకి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున జనం అక్కడికి రాగా అదే జనంలో నించుని ఉన్న ఓ వ్యక్తి తన చెప్పును తీసి... దానిని పవన్‌పైకి విసిరాడు. అయితే సదరు వ్యక్తి గురి తప్పి... ఆ చెప్పు పవన్ పై కాకుండా పవర్ కారు బానెట్ పై పడిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ కాసేపు కలకలం రేగింది. అయితే చెప్పు విసిరిన వ్యక్తిని మాత్రం పోలీసులు గుర్తించలేకపోయినట్లుగా సమాచారం. మొత్తానికి దాడులకు కూడా తాను వెరువనని పవన్ ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే ఆయనపై చెప్పు దాడి జరగడం గమనార్హం.