దక్షిణాది మీద ఉత్తరాది వారు అధిపత్యం పెరుగుతోంది. సౌత్ వాళ్లను నార్త్ వాళ్లు పట్టించుకోవటం లేదు. వివక్ష చూపిస్తున్నారు.. ఈ నిర్లక్ష్యం ఏ మత్రం సరికాదంటూ గడిచిన కొద్దిరోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల్ని కాసేపు పక్కన పెడితే.. సౌత్ లో తమ పట్టు పెంచుకోవటానికి బీజేపీ పడుతున్న ఆరాటం అంతాఇంతా కాదని చెప్పాలి.
ఎంతోకాలంగా.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. సౌత్ లో ఆ పార్టీ బలపడని పరిస్థితి. దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లో (తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ) పార్టీని బలపర్చేందుకు బీజేపీ చాలానే ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదని చెప్పాలి. ఉత్తరాదితోపాటు.. ఈశాన్య భారతంలోనూ కమలవికాసం జరుగుతున్నా.. దక్షిణాది మాత్రం ఒక పట్టాన కొరుకుడుపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. సౌత్ మీద పట్టు కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ ఒకటి వేసిందా? అంటే అవుననే చెబుతున్నారు.
కర్ణాటకను లక్ష్యంగా చేసుకున్న ఈ వ్యూహంలో.. ఆ రాష్ట్రంలో అధికారపక్షంగా అవతరించటంతో పాటు.. సౌత్ లో తమ ముద్ర వేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగాతాజాగా ఒక అడుగుపడిందని చెప్పాలి. కర్ణాటక కాంగ్రెస్ లో కీలకనేత.. పట్టున్న నాయకుడు.. మాజీ కేంద్రమంత్రి ఎస్ ఎం కృష్ణను తమ పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో బీజేపీ విజయవంతం అయ్యిందని చెప్పాలి. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ తో కలిసి ఉన్న ఆయన.. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. ఆయన రాజీనామా లేఖ కాంగ్రెస్ కు కరెంటు షాక్ మాదిరి మారింది.
లేఖ అందిన మరుక్షణం సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఫోన్ చేసి.. కృష్ణతో మాట్లాడి.. బుజ్జగించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నాలుగుగంటల వ్యవధిలోనే.. బీజేపీ నేత ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎస్ ఎం కృష్ణ హాజరు కావటం చూస్తే.. ఆయన తన నిర్ణయాన్ని ఆవేశంతో కాకుండా ఆలోచనతో తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ కు కృష్ణ గుడ్ బై చెప్పిన వార్త కర్ణాటక కాంగ్రెస్ లో భారీ కలకలాన్ని రేపింది. ఆయనకు మద్దతు ఇచ్చేవారు.. ఆయన్ను అనుసరించే పలువురు నేతలు ఆయన ఇంటికి పోటెత్తారు. ఇదిలా ఉండగా.. ఎస్ ఎం కృష్ణతో బీజేపీ ఏం చేయనుందన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా..దక్షిణాది వారిని చిన్నచూపు చూడటం లేదని.. పెద్ద పదవిలో కూర్చోబెట్టిన పేరుతో పాటు..కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీ భారీ లబ్ధిని పొందనుంది.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధరామయ్య సర్కారును దెబ్బ తీసేలా బీజేపీ తాజా వ్యూహం ఉందని చెప్పాలి. సిద్దరామయ్య సర్కారుపై ఇప్పటికే ఉన్న ప్రజావ్యతిరేకతతో పాటు.. మరి కొద్ది నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కృష్ణను బీజేపీలోకి తీసుకురావటం ద్వారా.. కాంగ్రెస్ కు భారీ నష్టాన్ని కలగించటంతో పాటు.. ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వటంద్వారా.. కన్నడ ప్రజలకు పెద్ద పీట వేసిన ఇమేజ్ ను సొంతం చేసుకోవచ్చు. కర్ణాటకలో విపక్ష పాత్ర పోషిస్తున్న బీజేపీ.. కృష్ణ రాక మరింత బలాన్ని ఇవ్వటంతో పాటు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి మరింత అవకాశాన్ని ఇస్తుందని చెప్పాలి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. దక్షిణాదిలోని ఒక రాష్ట్రంలో బీజేపీ పాగా వేసినట్లు అవుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తన సత్తా చాటుతున్న బీజేపీకి.. దక్షిణాదిలో ఏమీ చేయలేకపోతున్నామన్న కొరత తీరుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/