దేశంలో స్మార్ట్ సిటీ అవార్డ్స్2020: ఏ నగరాలకి వచ్చిందంటే?

Update: 2021-06-26 10:30 GMT
దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్మార్ట్ సిటీ మిషన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరాలకు నిధులు ఇచ్చి స్మార్ట్ సిటీలుగా మార్చి ఎవరైతే బాగా పనిచేస్తారో.. నగరాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతారో ఆ నగరాలకు అవార్డులను కేంద్రం ప్రతీఏటా అందజేస్తుంది.

ఈ ప్రాజెక్ట్ మొదులపెట్టి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియా స్మార్ట్ 2020 అవార్డులను శుక్రవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తమ నగరాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ అవార్డులను అందజేశారు.

దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీలలో మొత్తం పనితీరు ఆధారంగా సూరత్, ఇండోర్ మొదటి స్థానంలో నిలిచాయి.2019లో స్మార్ట్ సిటీస్ లో ఒంటరిగా సూరత్ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవగా.. ఈసారి ఇండోర్ కూడా సేమ్ పోటీదారుగా మొదటి స్థానాన్ని పంచుకుంది.

ఈ ప్రాజెక్ట్ మిషన్ కింద 5924 ప్రతిపాదిత ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.178000 కోట్లు అని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీలుగా ఏడు నగరాలను తీర్చిదిద్దిన ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా మొత్తం 126 నగరాలు స్మార్ట్ సిటీ అవార్డుల కోసం పోటీపడ్డాయి. ఇందులో 9 నగరాలకు 4 స్టార్ రేటింగ్ దక్కాయి. వీటిలో సూరత్, ఇండోర్, అహ్మదాబాద్, ఫూణే, విజయవాడ, రోజ్ కోట్, విశాఖపట్నం, పింప్రి-చిన్చ్వాడ్, వడోదర ఉన్నాయి.

ఇక ఏపీలోని తిరుపతి నగరాకిని 5 అవార్డులు దక్కాయి. దేశంలో ఇండోర్, సూరత్ నగరాల తర్వాత ఐదు అవార్డులు దక్కించుకున్న ఏకైక నగరం తిరుపతి మాత్రమే. పారిశుధ్యం, ఈహెల్త్ విభాగంగా దేశంలోనే తిరుపతికి మొదటి స్థానం దక్కింది. బెస్ట్ సిటీ, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానంలో నిలిచింది. అర్బన్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో మూడో స్థానం దక్కింది.

ఇక ఈ స్మార్ట్ సిటీ విభాగాల్లో తెలంగాణలో నగరాలు ఒక్కటీ చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం.
Tags:    

Similar News