అప్పట్లో ఆమె ప్రిన్స్ ను కలవాలనుకున్నారట

Update: 2015-10-21 04:23 GMT
స్మితా సబర్వాల్ అన్న పేరు విన్న వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దాదాపుగా ఆమెను గుర్తు పట్టేస్తారు. నిజాయితీగా ఉండటం.. కష్టపడి పని చేయటం ద్వారా ఐఏఎస్ అధికారుల్లో ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంకితభావంతో పాటు.. ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆమెలో చాలా ఎక్కువని చెబుతుంటారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీతో పాటు.. తెలంగాణ రాష్ట్రాల్లో విధులు నిర్వహించిన ఆమె.. విభజన తర్వాత తెలంగాణ క్యాడర్ లో పని చేయటం తెలిసిందే. మెదక్ కలెక్టర్ గా సుపరిచితురాలైన ఆమె పని తీరును మెచ్చి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను సీఎం పేషీలో కీలక బాధ్యతలు అప్పజెప్పటం తెలిసిందే.

స్మిత సబర్వాల్ కు సంబంధించి వృత్తి పరమైన అంశాలు బాగానే ప్రచారంలో ఉన్నా.. ఆమె వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి పెద్దగా తెలిసింది తక్కువ. కానీ.. ఆమె హీరో మహేశ్ బాబుకు పెద్ద ఫ్యాన్ అన్న విషయాన్ని ఆమె ఇటీవల చెప్పుకొచ్చారు.

నిత్యం పని ఒత్తిడిలో క్షణం తీరిక లేకుండా గడిపే ఆమె.. ఏ మాత్రం ఖాళీ దొరికినా తన పిల్లలతో గడపటానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సరదాగా సినిమాలు చూడటం ఇష్టమైన ఆమెకు హిందీలో షారూక్ ని అభిమానిస్తారు. ఇక.. కంగనా రౌనత్ అంటే ఆమెకు ప్రత్యేక అభిమానం. బాలీవుడ్ లో దిల్ ధడకనే దో సినిమా అంటే ఆమెకు చాలా ఇష్టం. మరి.. టాలీవుడ్ విషయానికి వస్తే.. ఆమె ప్రిన్స్ మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్.

ఇప్పుడైతే సినిమాలు చూసే సమయం దొరకటం లేదు కానీ.. గతంలో ఆమె.. ఒక్కడు సినిమా చూసిన సమయంలో ప్రిన్స్ మహేశ్ బాబును కలవాలని అనుకున్నారట. కానీ.. అది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయం కానీ.. ప్రిన్స్ కు తెలిస్తే సంతోషపడిపోతారేమో. ఒక నిజాయితీ ఉన్న ఐఏఎస్ అధికారి తనకు ఫ్యాన్ అంటే ఏ హీరోకి మాత్రం సంతోషంగా ఉండదు.
Tags:    

Similar News