ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఒకవైపు.. ఆయన పక్కనే తీక్షణంగా ఆయన కళ్లల్లో చూస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోవైపు.. ఇద్దరు ఎస్కలేటర్ పై వస్తూ ఓ ఫొటో దిగారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది..
తాజాగా భారత్ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తో కలిసి ‘భారతీయ పోషణ్ కృషి కోష్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ తో ఉన్న ఫొటోను స్మృతి ఇరానీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటో కింద.. ‘మనం డిగ్రీ పూర్తి చేయలేదు కదా.. ఇప్పుడేం చేద్దాం’ అని రాసుకొచ్చింది.
అయితే చాలా మందికి స్మృతి ఇరానీ అలా ఎందుకు రాసిందో అర్థం కాలేదు.. తీక్షణంగా ఆలోచిస్తే అసలు నిజం తెలిసింది. స్మృతి ఇరానీ - బిల్ గేట్స్ ఇద్దరూ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కానీ బిల్ గేట్స్ ప్రపంచంలోనే కుబేరుడిగా ఎదిగాడు. మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించి ఔరా అనిపించాడు. ఇక స్మృతి ఇరానీ కేంద్రమంత్రి అయ్యారు.
ఆ విషయాన్నే పరోక్షంగా తనను విమర్శించే వాళ్లకు ఎత్తి చూపేందుకు స్మృతి ఇరానీ ఈ కామెంట్ జత చేసి ఫొటోను షేర్ చేశారు. కృషి - పట్టుదల ఉంటే చదువు పెద్ద అడ్డంకి కాదని ఈ క్యాప్షన్ ద్వారా సృతి తెలియజేసినట్టైంది. అయితే స్మృతి ఇరానీ ఫొటోను అప్పటికే చాలా మంది ట్రోల్స్ చేయగా.. అసలు విషయం తెలిసి ఊరుకుంటున్నారు.