పోయిన చోటు వెతుక్కోవాలన్న కసితో ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తున్నారు. గాంధీ ఫ్యామిలీకి కంచుకోట లాంటి అమేధీలో పాగా వేయాలన్నది ఆమె కల. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ యువరాజు రాహుల్ మీద పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ.. మోడీ పుణ్యమా అని ఆమెకు కేంద్రంలో మానవవనరుల శాఖ లాంటి బ్రహ్మాండమైన పోర్ట్ ఫోలియో దక్కింది.
కేంద్రమంత్రి పదవి లభించిందని మురిసిపోకుండా.. యథావిధిగా తరచూ అమేధీలో పర్యటిస్తూ.. అక్కడ తన పట్టును మరింత పెంచుకుంటున్న ఆమె రాహుల్ కు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉండరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఓటమి పాలు అయినప్పటికీ.. మొదటి ఐదు రౌండ్ లకు సంబంధించి రాహుల్ కు ఇచ్చిన షాక్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.
మొదటి ఐదు రౌండ్ లలో ఓట్ల లెక్కింపులో వెనుకబడిన రాహుల్.. తర్వాత కోలుకొని విజయం సాధించటం వేరే విషయం. కంచుకోట లాంటి అమేధీలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ కు ఒకట్రెండు రౌండ్ లలో అయినా చుక్కలు చూపించిన స్మృతి ఇరానీ.. ఎప్పటికైనా అమేధీని తన సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా తరచూ పర్యటించే ఆమె.. ఆ మధ్యన సైకిల్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని.. గాంధీ ఫ్యామిలీకి చెందిన రాజీవ్ ట్రస్ట్ కొనుగోలు చేయటం.. దీనిపై స్మృతి అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఈ సందర్భంగా రాహుల్ పై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీకి కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయాన్ని అమేధీలో తాజాగా జరిగిన బహిరంగ సభలో ప్రస్తావిస్తూ.. రాహుల్ కు దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలని సవాలు విసిరారు. లీగల్ నోటీసులు ఇచ్చి తనను భయపెట్టలేరని చెప్పిన ఆమె.. గతంలో సైకిల్ ఫ్యాక్టరీ పెడతామని ఓ కంపెనీ భూమిని తీసుకున్నారని.. ఆ తర్వాత సదరు కంపెనీ యాజమాన్యం దివాళా ప్రకటించి రాజీవ్ ట్రస్ట్ కు అమ్మేసిందని చెప్పిన స్మృతి వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నోటీసులుపంపినట్లుగా స్మృతి చెప్పుకొచ్చారు. నోటీసులు ఇచ్చి తన నోటిని మూయించలేరని చెప్పిన స్మృతి సవాలుకు రాహుల్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.