ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా కీలకమైన కేంద్రమంత్రి పదవిని చేపట్టటం.. అది కూడా కీలకమైన శాఖకు మంత్రి కావటం అంత సులువైన విషయం కాదు. అలాంటి చాన్స్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సొంతమని చెప్పకతప్పదు. అయితే.. ఆమె విద్యార్హత గురించి ఇప్పటికే పలు వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఇప్పటికే ఆమె పలు వివరణలు ఇచ్చారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆమె అడ్డంగా బుక్ అయ్యే వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. తన విద్యార్హతల గురించి ఢిల్లీ యూనివర్సిటీకి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని.. తన వివరాలు వెల్లడించొద్దని ఆమె చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన విద్యార్హతల గురించిన వివరాల్ని ఇవ్వొద్దని ఢిల్లీ యూనివర్సిటీని ఆమె కోరిన విషయాన్ని వర్సిటీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో సదరురికార్డుల్ని తమకు అందించాల్సిందిగా కమిషన్ కోరింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీకి షాకాజ్ నోటీసుల్నిజారీ చేసింది. గడిచిన మూడు దఫాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీ భిన్నమైన విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్న అందించినట్లుగా ఆమె ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూరేలా తన వివరాల్నిఇవ్వొద్దంటూ ఢిల్లీ యూనివర్సటీకి సమాచారం ఇవ్వటం ఇప్పుడు తాజా కలకలంగా మారిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/