హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని ఇటీవలి ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మొన్న చేసిన సుదీర్ఘ ప్రసంగం, అనంతర వ్యాఖ్యలపై ఇప్పటికే గొడవ జరుగుతోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి క్షమాపణ చెప్పే వరకు సభ జరగనివ్వబోమని హెచ్చరించారు. సభలో దుర్గాదేవిని ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తప్పుబట్టారు. రాజ్యసభలో శుక్రవారం సభ ప్రారంభం కాగానే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి యూనివర్సిటీ వివాదాన్ని లేవనెత్తింది. మంత్రి స్మృతి ఇరాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా సభలో దుర్గాదేవిని ప్రస్తావించడాన్ని తప్పుబట్టిన విపక్ష సభ్యుల ఆరోపణలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. రాజ్యసభకు వచ్చిన ఆమె విపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ 'నేను హిందువును.. దుర్గాదేవి భక్తురాలినని సమాధానమిచ్చారు. అయితే విపక్షాలు ఆందోళనను విరమించకపోవడంతో.. డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ నిబంధనలు పరిశీలించి దుర్గాదేవిపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పడంతో వివాదం కొంత సద్దుమణిగింది.