క్రికెట్లో ప్రపంచ రికార్డు.. మగాళ్లెవ్వరికీ సాధ్యం కాలేదు.. సత్తాచాటిన భారత మహిళ!
ఆడవాళ్లు ఆడే క్రికెట్ లో మజా ఏమంటుందీ.. అనేవారు కోకొల్లలు! కానీ.. తమ ఆట, మగాళ్లకు ఏ మాత్రం తీసిపోదని నిరూపిస్తూనే ఉన్నారు మహిళలు. తాజాగా.. భారత క్రీడాకారిణి అద్భుతమైన ఘనత నెలకొల్పింది. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచంలో మగాళ్లెవ్వరికీ సాధ్యంకాని రికార్డును ఆమె నెలకొల్పింది. ఆ క్రీడాకారిని మరెవరో కాదు.. స్మృతి మందాన!
ప్రస్తుతం ఐదు వన్డేల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా మహిళల జట్టు భారత్ లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా లక్నోలో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్వితీయ విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాట్స్ ఉమెన్ స్మృతి మందాన మరోసారి చెలరేగి ఆడింది. ఆమె జోరుతో భారత్ గెలుపు బావుటా ఎగరేయడమే కాకుండా.. ఈ మ్యాచ్ లో తాను సాధించిన పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
ఓపెనర్ గా వచ్చిన స్మృతి.. చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడింది. 64 బంతులు ఎదుర్కొన్న మందాన.. 80 పరుగులతో వీరవిహారం చేసి నాటౌట్ గా నిలిచింది. ఇందులో ఏకంగా పది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా వరుసగా పది మ్యాచుల్లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన క్రికెటర్ గా నిలిచింది మందాన. అంతేకాదు.. ఇవన్నీ ఛేజింగ్ లో చేయడం విశేషం! లక్ష్య ఛేదనలో ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లోనూ సత్తాచాటి.. ఈ అరుదైన ఫీట్ సాధించింది.
వరుసగా పది మ్యాచ్ లలో 67, 52, 86, 53, 73, 105, 90, 63, 74, 80 స్కోర్లు సాధించింది మందాన. తన కెరీర్లో ఇప్పటి వరకూ 53 వన్డే మ్యాచ్ లు ఆడిన స్మృతి మందనా.. 44.14 సగటుతో 2119 పరుగులు చేసింది. ఇందులో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.