కాలానికి తగినట్లు ఉద్యమం. నాయకులకు తగినట్లు పోరాటం. ఏ మాత్రం స్పందించని పాలకులకు అంతే స్థాయిలో గట్టిగా రిప్లై ఇచ్చే ఘాటైన నీటైన స్మార్ట్ నిరసన ఇది. ఇలా ఉక్కు ఉద్యమం బాగా అప్డేట్ అవుతోంది.
విశాఖ ఉక్కుకు ఈ రోజుతో నాలుగు దశాబ్దాలు నిండాయి. ఫిబ్రవరి 18 వచ్చింది అంటే విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక్క లెక్కన జరుపుకుంటారు. అలాంటిది గత ఏడాదిగా అక్కడ సంతోషాలు లేవు, ఎంతసేపూ ఆందోళనల హోరే.
దానికి కారణం కేంద్రం. విశాఖ ఉక్కుని తెచ్చి ఏకంగా బలిపీఠం మీద పెట్టేసింది. భలే మంచి చౌక బేరమూ అంటూ ఉక్కుని అమ్మకానికి రెడీ చేసి పెట్టేసింది.
దాంతో ఉక్కే దిక్కుగా బతుకుతున్న వేలాది కార్మిక కుటుంబాలు ఇపుడు అయోమయంలో పడ్డాయి. ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించండి అంటూ చేసిన ఆందోళనలు అన్నీ విశాఖ సాగర తీరంలోనే కలసిపోతున్నాయి. కానీ ఢిల్లీ ప్రభువుల చెవికి ఏ మూలనా ఎక్కడంలేదు.
దాంతో ఆవిర్భావ దినోత్సవ వేళ ఉక్కు పోరాట కమిటీ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రులకు నేరుగా తాకేలా వారి చెవులకు, కళ్ళకూ సోకేలా సందేశాలను వెల్లువలా పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది.
కేవలం ఉక్కు కార్మికులే కాదు, విశాఖ ఉత్తరాంధ్రా జనానే కాదు, ఏపీలోని పదమూడు జిల్లాల ప్రజానీకం అంతా ఒక్కటై కేంద్ర మంత్రుల నంబర్లకు సందేశాలను, మెయిల్స్ కి తమ బాధను తెలియచేయాలని కమిటీ తీర్మానించింది. ఈ రోజు నుంచి మొదలుపెట్టి 21 వరకు మెసేజ్‌లు, మెయిల్స్ ద్వారా పంపాలని కోరుతోంది..
కేంద్ర ఉక్కుశాఖమ౦త్రి రామ్ దాస్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లకు ఎస్ ఎం ఎస్ ల ద్వారా, ఈ మెయిల్ ద్వారా పంపాలని ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చి౦ది.
వాటికోస౦ మంత్రులకు సంబంధించిన 9848544469, 9473199323 ఫోన్ నెంబర్లు, అలాగే, nsitharaman@nic.in, ram.chandra@sansad.nic.in మెయిల్ ఐడీలను ప్రకటించి౦ది. STOP SALE OF VIZAG STEEL PLANT అంటూ ఈ సందేశాలను వెల్లువలా పంపాలని కోరుతోంది.
నిజంగా ఇది గొప్ప కార్యక్రమమే అవుతుంది అంటున్నారు. ఇపుడు ప్రతీ వారి చేతిలలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వారు తెల్లారి లేస్తే ఎన్నో మెయిల్స్, సందేశాలు పంపుతారు. అలాంటిది తమ ప్రాంతానికి ఏపీకి న్యాయం జరిగే ఒక మంచి కార్యక్రమం కోసం సందేశాలను పంపిస్తే వారు కూడా పోరాటంలో పాలు పంచుకున్నట్లు అవుతుంది.
కేంద్ర పెద్దలకు కూడా విశాఖ సహా ఏపీ ప్రజల వాడీ వేడీ ఏంటి అన్నది తెలుస్తుంది అంటున్నారు. సో అంతా ఇక మీదట ఎన్ని వీలు అయితే అన్నేసి సందేశాలు ఇచ్చిన కేంద్ర మంత్రుల నంబర్లకు పంపించడమే తరువాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కుని నిలబెట్టుకోవడానికి అందరూ తలా ఒక చేయి వేయాల్సిందే.