ఆంధ్రప్రదేశ్ కు వేలాది కోట్ల రూపాయిల నష్టం వాటిల్లేలా చేయటంతో పాటు.. ఎర్రచందనం స్మగ్లింగ్ ను వ్యవస్థీకృతం చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గంగిరెడ్డి దేశానికి తీసుకొచ్చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చి.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దొంగ పాస్ పోర్ట్ తో దేశం దాటిన గంగిరెడ్డిని మారిషస్ నుంచి ఏపీ పోలీసులు ఢిల్లీకి తీసుకొచ్చారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై గతంలో అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నంలో నిందితుడైన గంగిరెడ్డి కోసం ఏపీ పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తాజాగా మారిషస్ జైల్లో ఉన్న గంగిరెడ్డిని.. అక్కడి కోర్టు సాయంతో భారత్ కు తీసుకొచ్చారు. ఇతడ్ని మారిషస్ నుంచి ఢిల్లీకి భద్రంగా తీసుకొచ్చేందుకు చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకదశలో గంగిరెడ్డిని భారత్ కు తరలించే సమయంలో రోడ్డు మార్గంలో ప్రయాణించే సమయంలో పైన హెలికాఫ్టర్ తో పహరా కాయటం గమనార్హం.
ఢిల్లీకి చేరిన గంగిరెడ్డిని.. ఆదివారం మధ్యాహ్నానానికి హైదరాబాద్ కు తీసుకురానున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కు 2003లో నాటి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై మావోల హత్యాయత్నం చేసినప్పుడు.. మావోలకు అవసరమైన సెల్ ఫోన్లు అందించారన్న ఆరోపణ ఉంది.
గత ఏడాది ఏప్రిల్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఏపీ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం మే 16న బెయిల్ మీద బయటకొచ్చిన ఇతగాడు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న సమాచారంతో ఆగమేఘాల మీద దేశం సరిహద్దులు దాటేశాడు. వివిధ దేశాల్లో పయనించి.. చివరకు మారిషస్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి అక్కడి పోలీసులకు చిక్కి దొరికిపోయాడు. కర్నూలు పోలీసులు ఇచ్చిన లుక్ ఔట్ నోటీసుల నేపథ్యంలో అతడ్ని మారిషస్ లో పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు సాయంగా నిలిచింది.
కడప జిల్లాలోకి ఒక ప్రముఖ రాజకీయ నేత కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన గంగిరెడ్డి.. తాజాగా ఏపీ పోలీసుల చేతికి చిక్కిన నేపథ్యంలో.. తాజాగా చేపట్టే విచారణ సంచలన విషయాల్ని బయటకు తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. సంచలన విషయాలకు సంబంధించి గంగిరెడ్డి నోరు విప్పుతారా? లేదా? అన్నది ఇప్పుడు వ్యక్తమవుతోన్న పెద్ద ప్రశ్న.