పాముని చూస్తే భయపడని వారు ఎవ్వరూ ఉండరు. అంత దేనికి కిచెన్ లో బొద్దింకను చూసినా భయపడి పరుగులు తీసే ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు. మరి చిన్ని సైజు పాము కనిపిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. గుండె వేగం పెరుగుతుంది. ఆమడ దూరంలో ఉండే పామును చూస్తేనే భయంతో పరుగుతీస్తారు. అలాంటింది. ఓ భారీ సైజులో ఉన్న పాము అడుగుల దూరంలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పోవా మన సంగతి ఎలా ఉన్నా ఉద్యోగి చేసిన సాహసాన్ని మెచ్చుకోవలసిందే.
వివరాల్లోకి వెళ్తే ..తాజాగా కోల్ కతా విమానాశ్రయం లో పాము కలకలం రేపింది. ఇండిగో విమానం బ్యాగేజీ లో హల్ చల్ చేస్తూ సిబ్బందిని కంగారు పెట్టింది. ఆ ఇండిగో ఫ్లైట్ రాయపూర్ నుండి కోల్ కతా కు వచ్చింది. ఆ విమానం కోల్ కతా నుండి ముంబైకి తిరిగి వెళ్లాలి. కాసేపటి తర్వాత మళ్లీ అది తన ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యింది. దీనితో ప్రయాణీకుల లగేజీని విమానం లోపలకు ఎక్కించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రన్ వే మీద నుంచి జరజరా ఒక పాము పాకుకుంటూ లగేజ్ స్టాండ్ మీదకు ఎక్కింది. అక్కడి నుంచి బ్యాగేజీ లోకి పాకింది.
ఆ పామును చూసిన వెంటనే విమానాశ్రయ ఉద్యోగి ప్లైట్ లోని బ్యాగేజీలోకి ఎక్కిన పామును సాహసోపేతంగా చేతితో కిందకి లాగేశాడు. సమాచారం అటవీ శాఖకు చేరవేయడంతో కొద్దిసేపటి తర్వాత అటవీ శాఖ సిబ్బంది ఎయిర్ పోర్ట్ కు వచ్చి పామును తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే...సదరు విమానాశ్రయం యొక్క రన్ వే చుట్టూ పాములు కనిపించడం సర్వ సాధారణం. కానీ ఈ విధంగా పాములు విమానాశ్రయంలోకి ప్రవేశించడం బహు అరుదు అని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎన్నో సార్లు ఎయిర్ పోర్ట్స్ లోకి పాములు ప్రవేశించి హల్ చల్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
Full View