తెలంగాణ రాష్ర్టమంత్రులకు కొత్త సమస్య వచ్చిపడింది. మంత్రుల అధికారిక నివాసాల్లో భారీ స్థాయిలో విషసర్పాలు కనిపించాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఎప్పట్లాగే సిబ్బంది పని చేస్తుండగా ఈ సర్పాలు కనిపించాయి. తెలంగాణ రాష్ర్ట మంత్రుల అధికారిక నివాసాల సముదాయంలో ఈ విషపు పాముల సంచారం కలకలం రేపుతోంది.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పనిచేసే సిబ్బంది నాగుపాము - నల్లత్రాచుల్లాంటి అత్యంత ప్రమాదకర పాములు సైతం మినిస్టర్స్ క్వార్టర్స్ లో సంచరిస్తున్నాయనే విషయాన్ని వారు గుర్తించారు. దీంతో సిబ్బంది నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందకొన్న జూ సిబ్బంది మూడు రోజులుగా పాములు పట్టే పనిలో నిమగ్నమయ్యారు. జూ సిబ్బందితో పాటు పాములు పట్టేవాళ్లు రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు రక్త పింజర, జెర్రిగొడ్డు - క్యాట్ స్నేక్ లాంటి విష సర్పాలను పట్టుకున్నారు. ఇతర విషసర్పాలు ఏమైనా ఉన్నాయా అనేకోణంలో వాటికోసం కూడా గాలిస్తున్నారు.
తెలంగాణ మంత్రుల నివాసంలో రక్షణకోసం సెక్యూరిటీతో పాటు విషసర్పాల కదలికను పసిగట్టేందుకు, పట్టుకునేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటుచేయాల్సి ఉంటుందేమోననే పలువురు చెణుకులు విసురుతున్నారు.