ఒకవైపు ఇ-కామర్స్ వెబ్ సైట్లు భారీగా ఆఫర్లను ప్రొవైడ్ చేస్తున్నాయని జనాలు ఎగబడుతూ ఉంటారు. ఆ వెబ్ సైట్లు కూడా తమ మార్కెటింగ్ కోసం ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఏదో ఒక రోజును ప్రత్యేకంగా పేర్కొంటూ..భారీ ఆఫర్లు అంటూ జనాలను రెచ్చగొడుతూ ఉంటాయి. తమ మార్కెటింగ్ ను పెంచుకుంటూ ఉంటాయి. ఇదంతా అందరికీ తెలిసిన కథే. అందరూ గమనిస్తున్న కథే!
అయితే.. ఆ ఆఫర్లు - రాయితీలు ఎలా సాధ్యం అనేది ఒక కొశ్చన్ మార్క్. వాళ్లకు షాప్ రెంట్స్ గట్రా చెల్లించాల్సిన పని లేదు, షో రూమ్ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఆఫర్లతో ఇవ్వగలరు అనేది ఒక లాజిక్. ఆ సంగతలా ఉంటే.. ఇ కామర్స్ వెబ్ సైట్లు వివిధ బ్రాండ్లకు నకిలీ వస్తులను యూజర్లకు చేరవేస్తూ ఉంటారు అనే ఆరోపణ కూడా ముంది. ఈ మేరకు ఇప్పుడు వరసగా పిటిషన్లు నమోదు అవుతూ ఉండటం గమనార్హం.
ఇప్పటికే ప్రముఖ ఇ కామర్స్ వెబ్ సైట్ స్పాప్ డీల్ మీద కాసియో కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. కాసియో బ్రాండ్ కు నకిలీ ప్రోడక్ట్స్ ను స్నాప్ డీల్ యూజర్లకు చేరవేస్తోందని ఆ సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. తమ నుంచి అధికారికంగా ఉత్పత్తులను కొనకుండా ఎవరో తయారు చేసే నకిలీలను వెబ్ సైట్ ద్వారా అమ్ముతోందంటూ కోర్టుకు ఎక్కింది ఆ సంస్థ.
అలాగే రాజస్తాన్ లో ఒక కాంగ్రెస్ నేత తను ఉడ్ ల్యాండ్ షూస్ ను స్నాప్ డీల్ ద్వారా బుక్ చేస్తే - అదే బ్రాండ్ షూస్ పంపించారని - అయితే అది నకిలీ అని తేలిందని ఫిర్యాదు చేశాడు. ఉడ్ ల్యాండ్ లోగోతో లోకల్ గా తయారు చేసే షూస్ ను తనకు స్నాప్ డీల్ పంపించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి ఇ కామర్స్ సైట్ల నుంచి ఎక్కువగా కొనుగోళ్లు చేసే వాళ్లు ఈ అంశం గురించి కాస్త ఆలోచించాల్సిందేనేమో!