నేరాలు ఎన్నిరకాలుగా ఉన్నాయో చెప్పలేం. ఒకరు దారిదోపిడీ చేస్తే.. మరొకరు ఇళ్లు లూటీచేస్తారు. కొందరు బ్యాంకులకు కన్నాలేస్తే.. మరికొందరు వైట్ కాలర్ నేరాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మోసగాడు మాత్రం వివాహిత మహిళలను టార్గెట్ చేస్తాడు. ఇక, పెళ్లై విడిపోయిన వాళ్లైతే మహదానందం. టార్గెట్ సెట్ చేశాడంటే మిస్సయ్యే ఛాన్సే ఉండదు. ఈ విధంగా ఎన్నో నేరాలకు పాల్పడ్డాడు ఆ దుండగుడు. అతని క్రైమ్ రికార్డును పరిశీలిస్తే...
ఆ వ్యక్తి పేరు రంగస్వామి. ఏపీలోని అనంతపురం పట్టణం. మూడు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ వచ్చాడు. లాలగూడలో సెటిల్ అయిన ఆ వ్యక్తి అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాడు. ముఖం చూడగానే నోట్లో వేలు పెడితే కొరకలేని వాడిలా ఉంటాడు. ఇక, ఇతగాడి మాటలకు ఎవ్వరైనా కరిగిపోవాల్సిందే. ఇవే.. తన ఆయుధాలుగా మలుచుకున్న రంగస్వామి.. తనలోని చోరకళకు పనిచెప్పాడు.
దొంగతనాలు చేస్తే రిస్క్ అనుకున్నాడో ఏమో.. పెళ్లైన ఆడవాళ్లను, ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేస్తాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. వారితో పరిచయం పెంచుకున్న తర్వాత శారీరక సుఖం అనుభవిస్తాడు. ఆ తర్వాత వారివద్ద ఉన్నదంతా దోచుకుని జెండా ఎత్తేస్తాడు. ఒకటీ, రెండు, మూడు.. అంటూ అన్ని కేసుల్లోనూ సక్సెస్ ఫుల్ గా బయటపడుతుండడంతో.. ఇదే వృత్తిగా ఎంచుకున్నాడు.
కానీ.. అందరూ ఒకేలా ఉండరు కదా.. అందుకే ఒక దగ్గర రివర్స్ కొట్టింది. ఓ మహిళను ఇదే పద్ధతిలో మోసం చేయడంతో.. ఆమె సైలెంట్ గా కూర్చోలేదు. వెళ్లిపోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. రంగస్వామి కోసం వేట మొదలు పెట్టారు. సదరు మహిళకు హ్యాండిచ్చిన ఇతగాడు.. మరో మహిళతో గోవాల్ చిల్ అవుతుండగా.. సైలెంట్ గా వెళ్లి పట్టేశారు పోలీసులు.
ఆ తర్వత విచారణలో రంగయ్య లీలలు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇతడిపై గతంలో ఒకటీ రెండు కాదు.. ఏకంగా 12 కేసులు ఉన్నాయి. చైన్ స్నాచింగుల నుంచి దొంగతనాల వరకూ అన్నీ చేసేశాడు. ఇప్పటి వరకు దాదాపు పది మందిని మోసగించాడు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నష్టపోయిన తర్వాత బాధపడేకన్నా.. ముందే మేల్కోవాలని సూచిస్తున్నారు.