సూపర్ స్టార్ సంచలన నిర్ణయం

Update: 2021-08-06 05:44 GMT
ఫుట్ బాల్ దిగ్గజం.. సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ నిర్ణయం అతడి ప్రతిష్టను మసకబారేలా ఉంది. ఎవరూ ఊహించని విధంగా ఈ ఫుట్ బాల్ ప్లేయర్ తాను ఇన్నాళ్లు ఆడుతూ వచ్చిన ఎప్సీ బార్సిలోనా క్లబ్ జట్టును వీడబోతున్నాడు.

అయితే మెస్సీ తాను బార్సిలోనా జట్టును వీడుతున్నట్టు ఎలాంటి లీకులు ఇవ్వకుండా సమాచారాన్ని ఇవ్వకుండా హఠాత్తుగా ఈ నిర్ణయానికి వచ్చి షాక్ ఇచ్చాడు.

బార్సిలోనాతో కాంట్రాక్ట్ రెన్యూవల్ చేసుకోలేదు. ఇదివరకే దాంతో కాంట్రాక్ట్ ముగిసింది. దాన్ని పునరుద్దరించకుండా ఆ క్లబ్ రెన్యూవల్ చేయడంలో జాప్యంచేసింది. అర్జెంటీనా ప్రభుత్వం కొన్ని నిబంధనలు తెరపైకి తేవడంతో జాప్యమైంది. క్రీడారంగాన్ని ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ పరిధిలోకి అర్జెంటీనా ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో బార్సిలోనా క్లబ్ మెస్సీ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించలేకపోయింది.

మెస్సీ లాంటి స్టార్ ప్లేయర్ ను ఎవరూ వదలుకోరని బార్సిలోనా సంకేతాలు పంపింది. ఈ గ్రేట్ ఫుట్ బాలర్ 21 ఏళ్ల పాటు ఈ క్లబ్ కు కొనసాగారు. ఇప్పుడు బార్సిలోనాతో తనకు ఉన్న అనుబంధాన్ని మెస్సీ తెంచుకోవడం అందరికీ షాక్ ఇచ్చినట్టైంది. మెస్సితో చాలా టైటిళ్లను బార్సిలోనా గెలిచింది. 20 సార్లు బార్సిలోనా తరుఫున మెస్సీ టాప్ స్కోరర్. చాలా టైటిళ్లను టీం గెలుచుకుంది. ఇప్పుడు ఈ చారిత్రక ఘట్టానికి మెస్సీ ఎగ్జిట్ తో తెరపడినట్టైంది. అయితే మెస్సీ ఇప్పుడు ఏ క్లబ్ లో చేరుతాడన్నది వేచిచూడాలి.




Tags:    

Similar News