కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు ఎక్కడైనా వినిపిస్తున్న మాట సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్). లాక్ డౌన్ - కర్ఫ్యూ విధించిన సమయంలో ఉదయం నాలుగు గంటల పాటు సడలింపు ఇవ్వడంతో బయటకు వచ్చినప్పుడు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు మార్కెట్లు - దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా చౌకధర దుకాణం - కిరాణం - మెడికల్ దుకాణాల వద్ద ప్రజలు కొంత దూరం దూరం పాటించి క్రమపద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. కరోనా వైరస్ విషయంలో గౌడ కులస్తులు కూడా సామాజిక దూరం పాటిస్తున్నారు. వినూత్న పద్ధతిలో కల్లు పోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తెలంగాణ ప్రజలు కల్లుప్రియులు. ఉదయం - సాయంత్రం కల్లు తాగుతుంటారు. తాటి - ఈతచెట్ల వద్ద లొట్టిలో ఉన్న కల్లును ఆకుల్లో పోస్తుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో గౌడ కులస్తులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామ శివారులో కల్లు తాగడానికి ప్రజలు రాగా గీత కార్మికులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. పైపు వినియోగించుకుని కల్లు పోశారు. ఆ పైపు ద్వారా ప్రజలు కల్లు తాగి సంతృప్తి చెందారు. గీత కార్మికులు పాటిస్తున్న వినూత్న ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు. అందరూ వారిని స్ఫూర్తితో సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. పైపు ద్వారా కల్లు తాగుతున్న వీడియో - ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శభాష్ గౌడన్న.. అందరూ అభినందిస్తున్నారు.