ఓ మాజీ ఎమ్మెల్యే భార్యను సైతం సైబర్ నేరగాళ్లు వదలలేదు. ఆమెను టార్గెట్ చేసి అభాసుపాలు చేశారు. వేధింపులపై మనస్తాపం చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే భార్యకు సైబర్ వేధింపులు మొదలయ్యాయి. ఆమె పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసిన కొందరు సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో అసభ్యంగా అభ్యంతరకంగా కొన్ని మెసేజ్ లు పెట్టారు.
ఇవన్నీ సదురు మాజీ ఎమ్మెల్యే భార్య స్నేహితులు - బంధువులకు వెళ్లడంతో ఆమె పరువు పోయింది. ఆమె పేరుతో చాటింగ్ కూడా నిర్వహించి కొందరినీ బుట్టలో పడేశారు.
ఈ విషయం ఆమెకు తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే భార్యను టార్గెట్ చేసిన వారి కోసం శోధిస్తున్నారు. సదురు మాజీ ఎమ్మెల్యే ఈ పనిచేయించాడా అన్న కోణంలోనూ పోలీసులు పరిశోధన చేస్తున్నారు.