తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు చిన్నమ్మ. ఆమెకు సంబంధించి రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పలువురు దృష్టిని ఆకర్షించింది. కాస్తంత మొరటుగా ఉన్నప్పటికీ.. చిన్నమ్మ పట్ల తన భావాన్ని వ్యక్తం బయటపెట్టేందుకు సదరు నెటిజన్ ఎలాంటి మొహమాటానికి గురి కాలేదు. పనోళ్లు పనోళ్లుగా ఉండాలే కానీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటూ వ్యాఖ్యను పోస్ట్ చేశారు.
నిజానికి ఇదొక్క పోస్టింగ్ మాత్రమే కాదు.. శశికళపై ఇలాంటి వ్యాఖ్యలు చాలానే కనిపిస్తాయి. ఇలాంటి వేళలో.. తమిళనాడుకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ నక్కీరన్ సంస్థ ఆన్ లైన్లో శశికళను ముఖ్యమంత్రిని చేయటం పైన ఒక పోల్ ను నిర్వహించారు.కేవలం గంట వ్యవధిలో ఆమెకు వ్యతిరేకంగా 7.12 లక్షల మంది ఓటు వేయగా.. అనుకూలంగా మాత్రం కేవలం 7400 మంది మాత్రమే ఓటు వేయటం గమనార్హం. ప్రజల తీర్పును ఆమె పాటించాలని 90 శాతం మంది చెప్పగా.. చిన్నమ్మ సీఎం పదవిని చేపట్టటం ఆ పార్టీ వ్యవహారంగా కేవలం 7 శాతం మంది మాత్రమేనని చెప్పారు.
మరో చిన్న వెబ్ సైట్ చిన్నమ్మ సీఎం పదవిని చేపట్టటంపై పోల్ నిర్వహించగా.. ఆ పోర్టల్ లో 25వేల మంది చిన్నమ్మను వ్యతిరేకించగా.. కేవలం 124 మంది మాత్రమే ఆమెకు అనుకూలంగా ఓటు వేయటం గమనార్హం. చిన్నమ్మకు అన్నాడీఎంకే నేతలు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆమె అంటే ఎంత వ్యతిరేకత ఉందన్న విషయం తాజా పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పొచ్చు. మరి.. ఈ పోల్ ఫలితాల్ని చూసిన తర్వాత అయినా అన్నాడీఎంకే నేతల మైండ్ సెట్ మారుతుందేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/