ఏంది మోడీ కళ్లద్దాల రేటు అంతా?

Update: 2019-12-27 04:25 GMT
ప్రధాని మోడీకి సంబంధించిన కొన్ని విషయాలు చూస్తే.. సోలో బతుకే సో బెటర్ అన్న మాట గుర్తుకు రాక మానదు. ఒంటరిగా ఉండే మోడీ చాలా సింఫుల్ అన్న మాట తరచూ వినిపిస్తుంటుంది. కమలనాథులు ఆ విషయాల్ని చాలా గొప్పగా చెబుతుంటారు. నిరాడంబరంగా ఉంటారని.. అనవసరమైన ఆర్భాటాలకు పోరని మోడీ గురించి గొప్పలు చెప్పినప్పటికీ.. కొన్ని వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటమే కాదు.. మోడీ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసేలా ఉంటాయని చెప్పాలి.

తాజాగా అలాంటిదే మరొక వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో తనకు ఒక వ్యాపారి కుటుంబం బహుకరించిన కోటు వేసుకోవటం.. దాని ధర మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంత ఖరీదైన బహుమతిని ప్రదాని మోడీ తీసుకోవటమా? అన్న ప్రశ్నతో పాటు.. ప్రధానిగా ఉన్న ఆయన ధరించిన కోటు ధర అంత భారీగా ఉండటమా? అన్న చర్చ జరిగింది.

ఇదిలా ఉంటే..తాజాగా మోడీ వాడిన కళ్లద్దాల గురించిన రచ్చ ఇప్పుడు షురూ అయ్యింది. దురదృష్టవశాత్తూ మేఘాలు కమ్ముకోవడం వల్ల గ్రహణాన్ని వీక్షించలేకపోయాను. కానీ.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోజికోడ్‌, ఇతర ప్రాంతాల్లో గ్రహణ దృశ్యాలను చూడగలిగానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేయటం తెలిసిందే. ఆ సమయంలో తాను దిగిన ఫోటోను మోడీ పోస్ట్ చేశారు. నల్లకళ్లద్దాలు ధరించి.. గ్రహణాన్ని చూసేందుకు ఉపయోగించే ప్రత్యేక కళ్లద్దాలను చేత్తో పట్టుకున్న ఫోటోను పోస్టు చేశారు.

మోడీ ధరించిన నల్లకళ్లద్దాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే.. ఆ కళ్లద్దాల ఖరీదే దానికి కారణంగా చెప్పాలి. మోడీ ధరించిన సన్ గ్లాసెస్ మేబాక్ కంపెనీవని.. దాని విలువ ఏకంగా రూ.1.4లక్షలుగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

మోడీ కళ్లద్దాలపై కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో వ్యంగ్యవ్యాఖ్యలు చేస్తున్నారు. జరిగే ఘటనల క్రమాన్ని అర్థం చేసుకోడంటూకాస్త ఎటకారం యాడ్ చేసి.. మొదట సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దాన్ని నేను 1995 డాలర్ల విలువైన మేబాక్ చలువ కళ్లద్దాలతో చూస్తాను. అప్పుడు అర్బన్ నక్సల్ నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతుంది. చివరగా నా కళ్లద్దాల్ని వేలం వేస్తాను. వాటిని గుజరాత్ లోని నా ఆశ్రితుడు కొంటాడు. మేం చాలా పేదవాళ్లమంటూ ఎటకారం ఆడేశాడు. ఇక.. మోడీ కళ్లద్దాల మీద కొందరు ప్రత్యేకమైన మీమ్స్ చేసి వాటిని ప్రధానికి ట్యాగ్ చేయగా.. మోస్ట్ వెల్ కమ్.. ఎంజాయ్ అంటూ రియాక్ట్ అయ్యారు. ఎవరేమన్నా అనుకోని.. నేను చేయాల్సింది చేస్తానన్నట్లుగా మోడీ తీరు ఉందని చెప్పక తప్పదు. అప్పట్లో ఖరీదైన సూట్ చేసిన డ్యామేజ్ మాదిరే తాజా కళ్లద్దాలు కూడా చేస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News