ఎక్కువ చేస్తే ఇంతే సంగతులు

Update: 2019-03-23 17:51 GMT
ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది.ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోన్, చాలా చౌకగా దొరికే డేటా ప్లాన్స్‌ తో సోషల్‌ మీడియాను నెటిజన్లు బాగా ఉపయోగిస్తున్నారు. ఇంతవరగు బాగానే ఉన్నా.. సోషల్ మీడియాలో ఇతర పార్టీల వారిపై  దాడి కూడా అలాగే ఉంది. అసత్యాలు ప్రచారం చేయడం, ప్రత్యర్థి పార్టీ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాల్ని బయటకు తీసుకురావడం లాంటివి చాలానే జరుగుతున్నాయి. దీంతో.. ఇప్పుడు సోషల్‌ మీడియాపై దృష్టి పెట్టింది ఎన్నికల కమిషన్‌.     

సోషల్‌ మీడియాలో వచ్చే ఏ అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది? ఏ అంశం రాదు? అనే పరిశీలనలో ఎన్నికల సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సోషల్‌మీడియాలో ప్రచారాలపై ఈసీకి వందల ఫిర్యాదులు అందాయి. దీంతో.. సోషల్‌ మీడియా ప్రమోషన్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంది ఈసీ. అన్నింటికి మించి ఈ రోజుల్లో ప్రతీ పార్టీకి సోషల్‌ మీడియా ఎక్కౌంట్‌ ఉంది. దీనికి తోడు పార్టీ అభిమానుల పేరుతో ఎక్కౌంట్లు కోట్లలో ఉన్నాయి. దీంతో.. సోషల్‌ మీడియా వేదికగా జరిగే పార్టీల ప్రచారం, ఆరోపణలపై ఈసీ సీరియస్‌గా దృష్టి సారించింది. అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెడితే చ‌ట్ట రీత్యా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తోంది.

అభ్యర్థులు కూడా నామినేషన్ల వేసే సమయంలోనే అభ్యర్థులు కూడా వారి సోషల్‌ మీడియా అకౌంట్స్‌ వివరాలు కూడా ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ నిబంధన విధించింది. నామినేషన్‌ వేసిన తర్వాత రోజు నుంచి వారి అకౌంట్స్‌ను కూడా ఎన్నికల సోషల్‌ మీడియా టీం పర్యవేక్షిస్తోంది. ప్రతి జిల్లాలో సోషల్‌ మీడియా మానిటరింగ్‌ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాల పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ఒక సోషల్‌ మీడియా పర్యవేక్షకుడిని ఎన్నికల సంఘం నియమించబోతోంది. ఎన్నికల కమిషన్‌ సోషల్‌ మీడియాలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారాన్ని గుర్తించి ఖర్చును వారి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంద‌ని చెప్తున్నారు
Tags:    

Similar News