21న ఆకాశంలో అద్భుతం ..'రింగ్‌ ఆఫ్‌ ఫైర్'‌

Update: 2020-06-16 05:45 GMT
ఈ  వైరస్ కష్టకాలంలో కాలంలో కాసింత ఊరట కల్పిస్తూ అంతరిక్షంలో జూన్ 21న అద్భుతం ఆవిష్క్రృతం కాబోతోంది. ఇండియాతోపాటూ ఆసియా దేశాలు, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్రికా, చైనా, ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించబోతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ప్రజలు దీన్ని చూసేందుకు వీలుంది. డైరెక్టుగా కాకుండా ప్రత్యేక పరికరాల్ని ఉపయోగించి దీన్ని చూడొచ్చు.

ఈసారి వచ్చే సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. ఇది ఏర్పడే సమయంలో భూమి, సూర్యుడి మధ్యలో చందమామ అడ్డుగా వస్తుంది. చందమామ పూర్తిగా సూర్యుణ్ని మూసివేసినప్పుడు నల్లటి చందమామ చుట్టూ, రింగ్ లాంటి ఆకారం ఏర్పడుతుంది. అదే రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు.గ్రహణంవేళ సూర్యుడిచుట్టూ ఉంగరం ఆకృతిలో వెలుగు కనిపించడమే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణమే ఉంటుంది. రాజస్తాన్‌ లోని ఘర్సానాలో ఉదయం 10.12 గంటలకు ప్రారంభమై.. 11.49 గంటలకు వలయాకార రూపు దాల్చి, 11.50 గంటలకు ఈ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ముగుస్తుందని బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్‌ దేవీ ప్రసాద్‌ వెల్లడించారు.

రాజస్తాన్ ‌లోని సూరత్‌ గఢ్, అనూప్‌ గఢ్, హరియాణాలోని కురుక్షేత్ర, సిర్సా, రథియా, ఉత్తరాఖండ్ ‌లోని డెహ్రాడూన్, చంబా, చమోలీ, జోషిమఠ్‌ ల్లో  ఆ నిమిషం పాటు ఆ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ను వీక్షించవచ్చు. గత సంవత్సరం డిసెంబర్‌ 26న కనిపించినంత స్పష్టంగా ఈ సారి రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనిపించదని దురై తెలిపారు. ఢిల్లీలో ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.48 గంటల వరకు, చెన్నైలో ఉదయం 10.22 గంటల నుంచి మధ్యాహ్నం 1.41 గంటల వరకు, బెంగళూరులో ఉదయం 10.13 గంటల నుంచి మధ్యాహ్నం 1.31 గంటల వరకు పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఉదయం 9.15కి మొదలై... సాయంత్రం 3.04కి ఈ సూర్యగ్రహణం వీడుతుంది
Tags:    

Similar News