సోలార్ ఈవీ వరల్డ్ రికార్డ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వెయ్యి కిలోమీటర్లు.!
ప్రస్తుతం ఇంధన ధరలు ఆకాశాన్ని అంటడం.. భవిష్యత్ లో ఇంధన సమస్య ఎదురు కానుండటం.. కాలుష్య నివారణపై ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతుండటంతో వాహన తయారీ సంస్థలైన బ్యాటరీ లేదా సోలార్ తో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా ప్రభుత్వాలు వీటిని విరిగా ప్రోత్సహిస్తుండటంతో భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్.. సోలార్ వాహనాలదే అనిపిస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రికల్ రంగ స్పీడుగా దూసుకెళుతోంది. ఇప్పటికే వాహన తయారీ రంగంలో ఉన్న ఆటో మొబైల్స్ కంపెనీలన్నీ కూడా ఈవీలను తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో టూ వీలర్స్.. త్రివీలర్స్.. ఫోర్ విలర్స్ తోపాటు భారీ వాహనాలను సైతం ఎలక్ట్రిక్ వెహికల్స్ లాగా మారిపోతాయి.
ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా పర్యావరణాన్ని పాటుపడే వెహికల్స్ అయినప్పటికీ వీటిలో అతి పెద్ద డిస్ అడ్వాంటేజ్ మాత్రం చార్జింగ్ చేసుకోవడం. మూడు నాలుగు గంటలు ఛార్జ్ చేస్తే కేవలం 60 నుంచి వంద కిలోమీటర్లు మాత్రమే ఈవీలతో ప్రయాణించవచ్చు.
ప్రస్తుత బీజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు అన్నేసి గంటలు ఛార్జింగ్ కోసం కేటాయించిన ప్రతీసారి ఇదే సమస్య ఉత్పన్నం కానుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే వీలైనంత ఎక్కువ దూరం ప్రయాణించేలా ఆటో మొబైల్స్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ విద్యార్థులు సోలార్ ఈవీని తెరపైకి తీసుకొచ్చారు.
సన్ స్విప్ట్ 7 ఈవీ పేరుతో రూపొందించిన సోలార్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. సౌరశక్తితో నడిచే సన్‌స్విఫ్ట్ 7ఈవీ గంటలకు 85కిమీ వేగంతో ప్రయాణించనుంది. దీనిలో ఏరోడైనమిక్స్.. ఎనర్జీ ఎఫిషియన్సీని ఒకే ఛార్జ్‌తో వెయ్యి కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ విద్యార్థులు నిరూపించారు.
ఈ వెహికల్ ఒక స్ట్రీమ్‌లైన్డ్ బాడీ.. తేలికపాటి అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. సౌరశక్తితో నడిచే సన్‌స్విఫ్ట్ 7 ఈవీ ఏరోడైనమిక్‌గా ట్యూన్ చేయబడి.. స్ట్రీమ్‌లైన్డ్ బాడీని చెక్కిన హుడ్ వాలుగా ఉన్న రూఫ్‌లైన్‌పై బహిర్గతమైన సోలార్ ప్యానెళ్లను కలిగి ఉంది. ఇది విండ్‌స్క్రీన్.. ఉబ్బెత్తుగా ఉండే వీల్ ఆర్చ్‌లు.. రెండు పెద్ద సీతాకోకచిలుక తలుపులు.. ఫ్లష్-బిగించిన డోర్ హ్యాండిల్స్.. ఫైబర్ విండోస్.. ఏరోడైనమిక్ కవర్‌లతో కూడిన తేలికపాటి అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.
అయితే ఈ కారును రేసింగ్ కోసం మరియు ప్రపంచ రికార్డు కోసం మాత్రమే తయారు చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ విద్యార్థులు వెల్లడించారు. అయితే రాబోయే కాలంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ కారులో పలు మార్పులు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని మాత్రం విద్యార్థుల బృందం వెల్లడించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.