సోలార్ ప్రోబ్ మరో అరుదైన ఘనత... వీడియో రిలీజ్..!

Update: 2022-01-08 09:45 GMT
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తోంది. సూరీడు రహస్యాలను తెలుసుకునేందుకు పంపిన అంతరిక్ష నౌక తన దైన శైలిలో దూసుకుపోతోంది. సూర్యుడి ఆవరణలోనే పరిభ్రమణం చెందుతూ అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నాసా శాస్త్రవేత్తలకు అందిస్తోంది. అయితే తాజాగా సూర్యుడి ఆవరణలో కి వెళ్లిన వీడియోను నాసా విడుదల చేసింది. ఎన్నో ఏళ్లుగా సూర్యుడి పై ఉన్న రహస్యాలను ఛేదించాలని చాలా దేశాలు పరిశోధనలు జరుపుతున్నాయి. కానీ అమెరికాకు చెందిన నాసాకు మాత్రం వీటన్నింటి కంటే ఒక అడుగు ముందే ఉంది.

అంతరిక్ష పరిశోధనలు ప్రారంభమైన నాటి నుంచి ఏ వాహకనౌక సూర్యుడు ఆవరణలోకి వెళ్ళలేదు. సోలార్ ప్రోబ్ పేరుతో ఓ వాహక నౌక ను అంతరిక్ష పరిశోధన సంస్థ అయినా నాసా ఇటీవల సూర్యుడి పై ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకునేందుకు అంతరిక్షంలోకి పంపింది.  అయితే సూర్యుని వద్ద ఉన్న వేడిని తట్టుకోవాలంటే సాధారణంగా ఏ వాహకనౌక కు సాధ్యం కాదు.  కానీ సోలార్ ప్రోబ్ దీనిని అధిగమించింది.  సూర్యుని ఆవరణం అయినా కరోనా లోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను నాసాకు ఎప్పటికప్పుడు అందజేస్తోంది ఈ క్రమంలోనే సోలార్ పంపిన ఓ వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది ఇవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి

సూర్యుని ఆవరణంలో కి వెళ్ళినా సోలార్ ప్రోబ్ తాజాగా కొన్ని ఫోటోలను వీడియోలను విడుదల చేసింది అయితే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారిని ఇవి ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి. ప్రపంచంలోనే ఇప్పటివరకూ ఏ దేశం కూడా సూర్యుని ఆవరణలోకి ప్రవేశించ లేదు కేవలం అమెరికాకు చెందిన సోలార్ మాత్రమే ఈ ఘనత సాధించింది. విశ్వంలో జరుగుతున్నా చాలా విషయాలపై నాసా పరిశోధనలు జరుపుతోంది ఈ క్రమంలోనే సూర్యుడిపై ఏం జరుగుతుంది అనే దానిని తెలుసుకునేందుకు ఈ సోలార్ ప్రోబ్ ని అంతరిక్షంలోకి పంపింది. ఈ పరిశోధనలు ప్రారంభమైనా సుమారు 60 ఏళ్ల నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక సంస్థ నాసా కావడం విశేషం.

సాధారణంగా సూర్యుని చుట్టూ ఉండే సోలార్ స్టీమర్ లో ఎవరికీ కనిపించవు ఇవి కేవలం గ్రహణం చోటుచేసుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి అయితే తాజాగా నాసా వాహకనౌక పంపిన ఫోటోలు వీడియోలు మాత్రం ఈ సోలార్ స్టీమర్ చాలా చక్కగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. అయితే సోలార్ ప్రోబ్ మరికొద్ది రోజుల్లోనే మరో అరుదైన ఘనత అడ్డుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి భానుడి కి అత్యంత సమీపంలో కి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకుల బృందం తెలిపింది. ఈ మిషన్ పూర్తిస్థాయిలో విజయవంతమైతే సూర్యుడి పై ఉన్నా చాలా రహస్యాలను నాసా అవుతుంది.




Full View




Tags:    

Similar News