సూర్యుని నుండి ఒక శక్తివంతమైన పేలుడు భూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నాసా తెలిపింది. భూమి పైపొరను అయనీకరణం చేసిందని.. ఇది ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్‌లో బలమైన షార్ట్‌వేవ్ రేడియో బ్లాక్‌అవుట్‌కు దారితీసిందని నాసా తెలిపింది. సూర్యుడి నైరుతి దిశ సమీపంలో ఉన్న సన్‌స్పాట్ నుండి మంట విస్ఫోటనం చెంది భూమిపైకి వచ్చిందని నాసా ఫొటోలు విడుదల చేసింది.
సూర్యుడిని ఎప్పుడూ పర్యవేక్షించే నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ద్వారా విస్ఫోటనం రికార్డు చేయబడింది. ఈ మంటను X1.2 మంటగా వర్గీకరించారు. X-తరగతి అత్యంత తీవ్రమైన మంటలను సూచిస్తుంది. సూర్యుడి నుంచి ఇది అత్యంత శక్తివంతమైన పేలుడు అని నాసా తెలిపింది. మంటలు , సౌర విస్ఫోటనాల వల్ల రేడియో కమ్యూనికేషన్‌లు, ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్‌లు , నావిగేషన్ సిగ్నల్‌లను ప్రభావితం చేస్తాయి. అంతరిక్ష నౌకలు , వ్యోమగాములకు ప్రమాదాలను కలిగిస్తాయి.
2023లో కేవలం మూడు నెలల్లో సూర్యుడి నుంచి సంభవించిన ఏడవ విస్ఫోటనం ఇది. ఇది 2022లో సూర్యుడి నుంచి వెలువడిన మొత్తం మంటల సంఖ్యకు సమానం. ఈ విస్ఫోటనం సూర్యుడిపై కొనసాగుతున్న కార్యకలాపాలు వేగంగా పెరుగుతాయని సూచిస్తుంది. సౌర చక్రం గరిష్ట పేలుళ్లకు దగ్గరగా ఉందని నాసా హెచ్చరించింది. ఈ మంటలు మార్చి 29న భూమిని తాకినట్లు తెలిపింది. దీని ద్వారా భూ వాతావరణాన్ని అయనీకరణం చేసిందని.. 30 MHz కంటే తక్కువ సిగ్నల్ , ఇతర రేడియో సిగ్నల్స్ ను కోల్పోయామని ప్రకటించింది. దీనిని హామ్ రేడియో ఆపరేటర్లు ఇప్పటికే గమనించారు.
మూడు సంవత్సరాలలో అత్యంత బలమైన భూ అయస్కాంత తుఫాను భూమిని తాకిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. భూ అయస్కాంత తుఫాను సూర్యుని యొక్క దక్షిణ అర్ధగోళంలో ఒక పెద్ద కరోనల్ రంధ్రం నుండి భారీ పేలుడు కారణంగా ప్రేరేపించబడి బయటకు వచ్చేసింది.
భూమి యొక్క మాగ్నెటోస్పియర్ ప్రధాన భంగాని ఈ సౌర తుఫాన్ ల వల్ల తీవ్ర ముప్పు అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అంతరిక్ష వాతావరణంలోకి చాలా సమర్థవంతమైన శక్తి మార్పిడి సంభవిస్తుందని.. ఇది కమ్యూనికేషన్, అంతరిక్ష ప్రయోగాలకు ఇబ్బంది అని తెలిపారు.
గత వారం, ప్లాస్మా సూర్యుని ఉపరితలం పైన పేలింది. 14 భూమిలు ఒకదానితో ఒకటి పేర్చబడి ఉన్నంత ఎత్తుకు ఇది ఎగచిమ్మింది. నాలుగు ముఖ్యమైన సౌర మంటలు, 22 కరోనల్ మాస్ ఎజెక్షన్లు , జియోమాగ్నెటిక్ తుఫాను గత వారంలో సూర్యుని నుంచి పేలి బయటకు వచ్చాయని నాసా తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.