పాతిక రూపాయలు పెట్టుబడి పెడితే లాభం ఎంతొస్తుంది...? 5 రూపాయలు... 10 రూపాయలు... మరీ రూపాయికి రూపాయి లాభమైతే 25 రూపాయల లాభమొస్తుంది... ఇంకా అదృష్టం కలిసొచ్చి రూపాయి 10 రూపాయల లాభమొచ్చినా 250 మాత్రమే వస్తుంది.. కానీ, పాతిక రూపాయల పెట్టుబడితో కోట్ల రూపాయాలు సంపాదించాడో సైనికుడు. అంతేకాదు... రాత్రికిరాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు. ఇంతకీ ఆయన పెట్టుబడి పెట్టింది వ్యాపారంలో కాదు, ఆన్ లైన్ గేమ్ లో...
బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే జాన్ హేవుడ్ అనే సైనికుడు ఆన్ లైన్లో 25 పెన్నీలు పందెం కాశాడు... ఆయనకు అదృష్టం వరించడంతో ఏకంగా 13.2 మిలియను పౌండ్లు గెలుచుకున్నాడు. అంటే ఇంచుమించు 130 కోట్ల రూపాయలకు సమానమన్నమాట.
...అయితే... ఒకేసారి ఇంతపెద్ద మొత్తం దొరకడంతో జాన్ ఏం చేస్తానంటున్నాడో తెలుసా... ఊపిరితిత్తులు గుండె జబ్బులతో బాధపడుతున్తన తన తండ్రికోసం అందులో ఎంతైనా ఖర్చు చేస్తానంటున్నాడు. ఒక వేళ డబ్బు మిగిలితే తన బంధువులందరినీ కలిపి మధ్యధరా సముద్రంలోకి విహారయాత్రకు కూడా తీసుకెళ్తానని చెబుతున్నాడీ పాతికేళ్ల సైనికుడు.