ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విచిత్రమైన చట్టాలు... మనం ఏమాత్రం ఊహించని నిషేధాజ్హలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎంతో ఇష్టంగా తినే ఆహారపదార్తాలపై పలు దేశాల్లో నిషేధం ఉంది. అందుకు కారణాలు కూడా ఒక్కోసారి చాలా చిన్నవిగా ఉంటున్నాయి. హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లినా దొరికే సమోసాపై ఒక దేశంలో నిషేధం ఉంది.. అలాగే పిల్లలు ఎంజాయ్ చేసే కిండర్ జాయ్ పై బ్యాన్ విధించింది ఇంకో దేశం. ఇలా చెప్పుకొంటూపోతే తిండిపై నిషేధాలు చాలానే ఉన్నాయి.
- ఫ్రాన్సులో టమోటా కెచప్ ను అస్సలు అనుమతించరట. ఫ్రెంచి సంప్రదాయ వంటకాలకు ఇది పొగ పెడుతుందన్న ఉద్దేశంతో దీన్ని ఆ దేశంలో పూర్తిగా బ్యాన్ చేశారు.
- హైదరాబాద్ సహా ఇండియా అంతా పాపులర్ అయిన సమోసాను సోమాలియాలో నిషేధించారు. దీని షేప్ దీన్ని అక్కడ కనిపించకుండా చేసింది. త్రికోణ ఆకారంలో ఉండే సమోసాను కొన్ని మతపరమైన కారణాల వల్ల సోమాలియాలో బ్యాన్ చేశారు.
- ఇక అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పచ్చి బాదంపప్పు విక్రయాలు - కొనుగోళ్లపై నిషేధం ఉంది. దానివల్ల బ్యాక్టీరియా వ్యాపిస్తుందన్నది రీజన్.
- మన దేశంలో పిల్లలు అమితంగా ఇష్టపడే కిండర్ జాయ్ ను అమెరికా సహా పలు దేశాలు నిషేధించాయి.
- జెల్లీ స్బీట్లను బ్రిటన్ - ఐరోపా యూనియన్ దేశాల్లో నిషేధించారు. పిల్లల ఆరోగ్యానికి ఇవి మంచివి కావని తేలడంతో కఠిన నిషేధం వీటిపై అమలవుతోంది.
... ఇలా ఇండియాలో దొరికే ఎన్నో ఆహార వస్తువులు విదేశాల్లో నిషేధిత వస్తువుల జాబితాలో ఉన్నాయి. ఇతర కారణాల మాట ఎలా ఉన్నా ఆరోగ్యపరమైన కారణాలతో ఇతర దేశాలు నిషేధించిన ఆహారపదార్థాలపై ఇండియా కూడా తన విధానాన్ని సమీక్షించుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/