భారత ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనకు ఇంటర్నేషనల్ సెలబ్రెటీలు మద్దతు తెలుపుతున్నారు. పాప్ సింగర్ రిహన్నా.. సామాజిక కార్యకర్త అయిన గ్రేటా థంబర్గ్ ఇంకా పలువురు రైతులకు మద్దతుగా సోషల్ మీడియాలో స్పందిచారు. వారిపై ఇండియన్ సెలబ్రెటీలు పలువురు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఇది మా అంతర్గత వ్యవహారం మీరు ఇందులో స్పందించనక్కర్లేదు అంటూ సచిన్.. కోహ్లీతో పాటు బాలీవుడ్ ప్రముఖులు పలువురు అంటున్నారు.
ఇక కొందరు సోషల్ మీడియా జనాలు రైతు ఆందోళనకు మద్దతు తెలుపుతున్న వారిపై సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తున్నారు. బ్రిటన్ నటి సామాజిక కార్యకర్త అయిన జమీలా జమీల్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళనకు మద్దతు చెప్పింది. ఆమె కు ఇన్ స్టాగ్రామ్ లో మూడు మిలియన్ ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పోస్ట్ కు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఆమెను సమర్థించగా మరి కొందరు మాత్రం ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. జమీలా తనపై వస్తున్న బ్యాడ్ కామెంట్స్ కు స్పందించింది. తాను చేసిన పోస్ట్ కు కొందరు తనను రేప్ చేస్తానంటూ బెదిరిస్తున్నారు. వారు మెసేజ్ లతో నన్ను మానసికంగా హింసిస్తున్నారు అంటూ జమీలా ఆవేదన వ్యక్తం చేసింది.