సాధారణంగా పొలిటిషియన్లు ఏదైనా సినిమా కార్యక్రమాలకు వెళ్లినపుడు సదరు సినిమా గురించి నాలుగు ముక్కులు మాట్లాడడం...చిత్ర యూనిట్ మీద పొగడ్తలు గుప్పించడం పరిపాటి. ఒకవేళ ఏదన్నా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమమో - కల్చరల్ అసోసియేషన్ ప్రారంభమో అయితే......ఏవో నాలుగు ముక్కలు మాట్లాడేసి వెళ్లిపోతారు. అయితే, ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ సినీ అసోసియేషన్ లాంచింగ్ ప్రోగ్రామ్ కు వచ్చిన ఆయన....ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ లోకి వెళ్లారు. తాను యువకుడిగా ఉన్నపుడు ....అందాలనటి వాణిశ్రీ ఫ్యాన్ అని....ఆమెను ప్రేమించానని....ఆ కార్యక్రమానికి వచ్చిన వాణిశ్రీ ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ ను సోమిరెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రసంగించిన సోమిరెడ్డి వాణిశ్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను యువకుడిగా ఉన్నపుడు వాణిశ్రీని ప్రేమించానని, ఆమె వీరాభిమానినని, ఆమె చిత్రాలన్నీ చూశానని చెప్పారు. ఆ సినిమాలన్నీ తనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయన్నారు. ఆ తర్వాత వాణిశ్రీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ - టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ - నటి వాణిశ్రీ - నటుడు భాగ్యరాజ్ - నిర్మాత సీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అయితే, వాణిశ్రీతో పాటు పలువురు సినీ ప్రముఖుల ముందే ...వాణిశ్రీ గురించి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.