వైసీపీ ఎమ్మెల్యే - సినీ నటి రోజా ప్రవర్తన సాటి మహిళా లోకాన్ని కించపరిచేలా ఉందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు సిగ్గుతో తలదించుకునేలా రోజా వ్యవహరిస్తున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన వీడియోలు ఎన్నో ఉన్నాయని ఆమె గమనించాలని గుర్తు చేశారు. రోజాపై శాసనసభా పతి ఐదేళ్ల అనర్హత విధించాలని డిమాండ్ చేశారు.
కాగా అంతకుముందు రోజా టీడీపీ నేతలు లోకేశ్ - బాలకృష్ట లపై విమర్శలు కురిపించారు. ఏపిలో కీచక పాలన సాగుతోందని, ఆడపిల్లను కనడమే నేరమనట్టు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ట మాట్లాడుతున్నారని రోజా నిప్పులు చెరిగారు. లోకేశ్ గతంలో తన స్నేహితులతో కలిసున్న ఫోటోలను చూపుతూ, ఈయనా యువనేత? అని ప్రశ్నాంచారు. మందు - విందులతో కాలం గడిపే లోకేశ్ కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని అడిగారు.`ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ట చేసిన వ్యాఖ్యలను రోజా ప్రస్తావించారు. యువతుల పట్ల తానేం మాట్లాడాడో బాలకృష్ట రికార్డులు చూసుకోవాలని హితవు పలికారు. నేతలే అలాగుంటే, మంత్రుల కొడుకులు ఇంకా రెచ్చిపోతున్నారని రావెల కిషోర్ బాబు తనయుడు ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, దుయ్యబట్టారు. రావెలను తక్షణం చంద్రబాబు మంత్రివర్గం నుంచి తొలగించాలని రోజా డిమాండ్ చేశారు. అయితే.... బాలకృష్ణ మాత్రం ఇంకా దీనిపై స్పందించలేదు... రోజాతో ఎన్నో సినిమాలు తీసిన బాలయ్య స్పందిస్తే ఎలాంటి డైలాగులు పడతాయో చూడాలి.