ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీజేపీ మినహా అధికార, ప్రతిపక్షాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా పార్టీలు తమదైన శైలిలో ఆందోళనలు తెలుపుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో తాజాగా అనూహ్య ప్రతిపాదనతో వచ్చింది ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ దక్షిణ భారత ఇన్ చార్జ్ సోమ్ నాథ్ భారతి. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. బీజేపీతో ఉండొద్దని... ఆ పార్టీ వ్యవహారం గురించి అవగాహన ఉన్న తాము చాన్నాళ్ల క్రితమే టీడీపీ కోరామని ఆయన వివరించారు. `వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన హామీని ప్రధాని మోడీ విస్మరించారు. హిందువుగా చెప్పుకునే మోడీ...అసలు హిందువేనా ? ఆయన నిజమైన హిందూ అయితే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చేవారు.` అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవిత్ర తిరుపతి నగరంలో... వెంకటేశ్వర స్వామి ఎదుట ఇచ్చిన హామీకే దిక్కులేదని సోమ్ నాథ్ వ్యాఖ్యానించారు. మోడీ హిందూ అయితే కచ్చితంగా ప్రత్యేక హోదాను నెరవేర్చాలి అని కోరారు. `ఆంధ్రకు 10 సంవత్సరాలు స్పెటస్ ఇవ్వాలని... విపక్షంలో ఉండగా వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయన పదవుల కోసం రాజీపడ్డారా? పార్లమెంట్‌లో మంత్రిగానీ, ప్రధానిగానీ ఒక హామీనిస్తే తప్పనిసరిగా నెరవేర్చాలి. మన్మోహన్ ఇచ్చిన హామీని మోడీ నెరవేర్చాలి. వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవిని వదులుకొని... ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ఆయన ప్రజల్లోకి రావాలి` అని సోమ్‌నాథ్ భారతి వ్యాఖ్యానించారు. `ఎన్టీఆర్ వలే చంద్రబాబు కేంద్రంపై పోరాడాలి. ప్రజాభిప్రాయాన్ని కాదని ఎన్టీఆర్ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పదవినుంచి తప్పించారు. ఎన్టీఆర్‌ను అప్పట్లో వీల్ చైర్ లో ఢిల్లీ వచ్చారు. నెలరోజుల్లోనే ఆయనను మళ్ళీ ఇందిరా గాంధీ... ముఖ్యంత్రి పదవిలో కూర్చోబెట్టక తప్పలేదు.ఎన్టీఆర్ లాగే చంద్రబాబు నాయుడు ... తెగించి పోరాడి... మోడీని ఎదుర్కోవాలి.` అని ఆయన సూచించారు. ప్రజాభిప్రాయాన్ని కాదని ప్రధాని మోడీ కూడా.. అప్పటి ఇందిరలాగే ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ చేసిన మోసాన్ని... చంద్రబాబు నాయుడు 29 రాష్ట్రాల్లో పర్యటించి బయటపెట్టాలని ఆయన కోరారు.
నరేంద్ర మోడీ ఒక మోసగాడని చంద్రబాబు చాటిచెప్పాలని ఆప్ నేత కోరారు. `నరేంద్రమోడీ ఒక మోసగాడు. ఆయనకు 2019లో అస్సలు ఓటు వేయొద్దు.. ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ కావాలి... హోదా కాదు . ప్రత్యేక హోదా ఇస్తే ప్రజలకు నేరుగా లబ్ది చేకూరుతుంది. ప్యాకేజ్ ఇస్తే నేతల అధికారుల జేబుల్లోకి వెళ్తుంది. అందుకే స్టేటస్ ఇవ్వాలి` అని ఆయన డిమాండ్ చేశారు. ఆప్ ఆంధ్రప్రదేశ్ నేత పోతిన రామారావు మాట్లాడుతూ
16 రాజకీయ పార్టీలు, సంఘాలు కలిసి ప్రత్యేక హోదా సాధాన సమితి ఆంధ్ర ప్రదేశ్ హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. రేపు సాయంత్రం 7 నుంచి 7.30 మధ్యకాలంలో ఏపీ ప్రజలు లైట్లు ఆపి నిరసన తెలపాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కూడా ఈ మేరకు పిలుపునివ్వాలని సూచించారు.