రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. అవకాశం.. అవసరం .. అనే రెండు ప్రధాన అంశాల ఆధారంగానే రాజకీయాలు సాగుతుంటాయి. ఇదే ఇప్పుడు రాష్ట్ర బీజేపీని కూడా కుదిపేస్తోంది. పార్టీలో సంస్థాగతంగా వచ్చిన నాయకులు ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. గతంలో కంభంపాటి హరిబాబు(ఇప్పుడు గవర్నర్), వెంకయ్యనాయుడు(ఇప్పుడు ఉపరాష్ట్రపతి).. ఇలా కొందరు నాయకులు ఉండేవారు. అయితే.. వీరిలో చాలా మంది ఇప్పుడు యాక్టివ్ రోల్ పోషించడం లేదు. దీనికితోడు.. పొరుగు పార్టీలపెత్తనం కూడా బీజేపీపై ప్రభావం చూపిస్తోంది.
అంటే.. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన కొందరు నాయకులు.. తమ ప్రభావం చూపించే వ్యూహాల తో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా పార్టీలో అవకాశం.. అవసరం కోసం ఎదురు చూస్తున్న నాయకు లు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో పొత్తుల విషయంలో ఆచి తూచి తీసుకునే నిర్ణయాలు.. ఇప్పుడు.. అప్పటికప్పుడు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇది.. రాష్ట్ర బీజేపీ సారథి.. సోము వీర్రాజుకు సుతరాము నచ్చడం లేదు.
పైగా.. తాము గతంలో వైరం పెట్టుకున్న పార్టీతో ఆయన జత కట్టేందుకు సిద్ధంగా లేరు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషిచేస్తామే.. తప్ప.. ఆ పార్టీతో జట్టుకట్టేది లేదని.. ఆయన బాహాటంగా చెబుతున్నారు. అయితే..పదవులు.. పీఠాలు ఆశిస్తున్న నేతలు.. మనం ఒంటరిగా అధికారంలోకి వచ్చేది కల్లేనని.. కాబట్టి పొత్తు పెట్టుకుంటే.. 2014లో జరిగిన సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని.. అప్పుడు కనీసం మనకు ఓట్లు సీట్లు అయినా..దక్కుతాయని.. అంటున్నారు.
అయితే.. ఇలా చెబుతున్న వారి బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్‌గా ఉండడంతో సోము వీరిని దగ్గరకు కూడా రానీయడం లేదు. దీంతో వీరంతా. పొత్తుల వరకు వేచి చూడాలని.. ఒకవేళ బీజేపీ పొత్తులు పెట్టుకోకుండా ముందుకు సాగితే.. అప్పుడే.. తమ ఫ్యూచర్ నిర్ణయించుకోవచ్చనివారు భావిస్తన్నట్టు.. చర్చ సాగుతోంది. అంటే.. సోము ఒంటరి అయిపోవడం ఖాయమని.. జంపింగులు ఈ సారి బీజేపీ నుంచి జరుగుతాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.