ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీడియా ముందుకు వస్తే చాలు చెప్పిందే చెబుతున్నారు అని సెటైర్లు పడిపోతున్నాయి. ఆయన కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది అని అంటారు.
వాటి మీద ఏపీ సర్కార్ స్టిక్కర్లు వేసుకుంటోంది అని మరో మాట అంటారు. కేంద్ర నిధులను వేరే వాటిని మళ్ళించేస్తున్నారు అని కూడా ఆరోపిస్తున్నారు. ఏపీలో అభివృద్ధి లేదని కూడా అంటారు. ఏపీని తామే ఆదుకున్నామని కూఒడా చెబుతారు.
సరే ఆత్మస్తుతి పరనిందా ఓకే కానీ ఏపీకి కేంద్రం నుంచి రావాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా. వాటి గురించి ఏంటి అంటే దానికి కూడా సోము సార్ చక్కగానే చెబుతున్నారు. అన్నీ త్వరలోనే అని ఆయన అంటారు.
ఏపీకి రైల్వే జోన్ అన్నది లేదు. దాని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మొత్తానికి మూడేళ్ళ క్రితం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చి మరీ రైల్వే జోన్ ఇచ్చేశామని కూడా చెప్పారు. కానీ జోన్ కూత మాత్రం ఎక్కడా వినిపించడంలేదు.
ఇక సోము వీర్రాజు అయితే త్వరలో రైల్వే జోన్ అని చెబుతున్నారు. త్వరలో సినిమా విడుదల పోస్టర్ మాదిరిగా జోన్ కల సాకారమవడానికి ఒక టైమూ, షెడ్యూల్ ఉందా అన్నదే కదా మరి అందరి డౌట్.
మరి జోన్ ఎక్కడ ఉంది, ప్రెజెంట్ పొజిషన్ ఏంటి అన్నది మాత్రం ఆయన చెప్పకుండా త్వరలోనే జోన్ అంటూ ఊరిస్తున్నారు. ఇప్పటికి ప్రధాని చెప్పే మూడేళ్ళు అయింది. ఇపుడు సోము కూడా అదే చెబుతూ త్వరలో అంటున్నారు అని అంటున్నారు.
అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నెత్తిన ప్రైవేట్ కత్తి పెట్టారు. ఏడాదిగా అది అలాగే ఉంది. మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏంటి సారూ అంటే దానికి కూడా జవాబు రెడీగానే ఉంది. స్టీల్ ప్లాంట్ ఏమీ కాదు, ఎక్కడికీ పోదు, మరి ఇలా చెబితే ఎవరైనా ఏమనుకుంటారు, ప్రభుత్వ రంగంలో ఉంటుందనే కదా. కానీ క్లారిటీగా ఆ విషయం మాత్రం చెప్పకుండా స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని చెబుతున్నారు.
మొత్తానికి ఇలాంటి మాటలు విని విని జనాలకు విసుగెత్తుతోంద్, కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి సారూ అంటున్నారు అంతా. అంతే కాదు, మీకు వీలైతే, అవకాశం ఉంటే కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి ఉంటే ఏపీకి రావాల్సినవి తీసుకురండి, ఆ విషయంలో పోరాడండి బాబూ అని అంతా సూచిస్తున్నారు. కానీ సోము సార్ మాత్రం ఏపీకి అంతా చేసేశామనే చెబుతూ వస్తున్నారు. ఇలాగైతే ఎలా మరి అంటే బీజేపీ పెద్దల వద్ద జవాబు ఉంటుందా.