ఏపీలో పంచాయతీ ఎన్నికల పుణ్యమాని ప్రతీకారంతో క్షేత్రస్థాయిలో దాడులు, ప్రతిదాడులు ఎక్కువయ్యాయి. అధికారంలో ఉన్న వైసీపీతో, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు సై అంటే సై అనడంతో ఈ గొడవలు పెద్దవి అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా సత్తెన పల్లి నియోజకవర్గంలోని లక్కరాజుగార్లపాడులో వైసీపీ కార్యకర్తల దాడిలో మృతిచెందిన గరికపాటి కృష్ణ రావు కుటుంబ సభ్యులను బుధవారం లోకేష్ పరామర్శించాడు. అనంతరం సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'టీడపీ కార్యకర్తల జోలికొస్తే తోలుతీస్తామని.. బీ కేర్ ఫుల్ ' అని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 25 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని.. పోలీసులు లేకుండా గ్రామాలకు వస్తే తమ కార్యకర్తలు తరిమికొడుతారని హెచ్చరించారు.
అయితే టీడీపీ కార్యకర్తల మరణంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేసినట్టు మాట్లాడారట.. టీడీపీ కార్యకర్తలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉందని.. అందుకే బీజేపీలోకి వచ్చేయండనీ సోము వీర్రాజు సెలవు ఇస్తున్నారు. దానికి సమాధానం ఇవ్వండి లోకేష్ బాబు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
నిజానికి అన్ని పార్టీల కంటే కార్యకర్తల బలం అధికంగా ఉన్న పార్టీ టీడీపీ అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అస్సలు కార్యకర్తలు, నేతలు లేని బీజేపీ ఈ కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు.ఏపీలో మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన బీజేపీ తేలిపోయింది. కనీసం జనసేన , స్వతంత్రులు గెలిచినన్నీ సీట్లు కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే గ్రామస్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలు, నేతలు బలంగా లేరు. అలాంటి పార్టీ నేత బలమైన టీడీపీ కార్యకర్తలను తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అస్సలు క్యాడర్ లేని బీజేపీలోకి.. ఏపీలో చివరి గ్రామం వరకు విస్తరించిన టీడీపీతో పోటీనా అని పచ్చపార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీకి వ్యతిరేక నిర్ణయాలతో అసలు బీజేపీని ఏపీ ప్రజలు పక్కనపెట్టేశారని.. డిపాజిట్లు కూడా ఆ పార్టీకి దక్కకుండా ఓడిస్తారని అంటున్నారు. టీడీపీ కార్యక్తలు బీజేపీలోకి అస్సలే రారు అని.. సడెన్ గా బీజేపీ వాళ్లకు ఈ డౌట్ ఎలా వచ్చిందో అని కూడా అంటున్నారు.