ఆ 7,200 కోట్లు ఏం చేశావ్‌ .. బాబుని ప్రశ్నించిన సోమువీర్రాజు ఫైర్

Update: 2020-09-08 13:00 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా పుష్కరాల్లో పలు దేవాలయాల్ని టీడీపీ నేలమట్టం చేసినప్పుడు హిందూత్వం గుర్తుకు రాలేదా అంటూ మండిపడ్డారు. హిందూత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ మాట్లాడే హక్కు టీడీపీకు లేదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.కృష్ణా పుష్కరాలలో 17 రకాల దేవాలయాలను తెలుగుదేశం ప్రభుత్వం నేలమట్టం చేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో విజయవాడ గోశాల ప్రాంతాన్ని తాము సందర్శించినపుడు తమపై బుద్దా వెంకన్న దాడికి ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు.

అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒక్క ఆలయమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. కృష్ణా పుష్కరాల్లో ఆలయాలు కూల్చేసినప్పుడు చినరాజప్ప ఏమైపోయారని..ఆ రోజు మాట్లాడని రాజప్ప ఇప్పుడు అంతర్వేది ఘటన పై ఎలా మాట్లాడతారని సోము వీర్రాజు విమర్శించారు. దేశంలో రాజధాని నిర్మాణాలు ఎక్కడ జరిగినా అమరావతి అంతగా హైప్ లేదని, చైనా, జపాన్, సింగపూర్ అంటూ హైప్ క్రియేట్ చేశారే కానీ అమరావతి ఎందుకు నిర్మించలేదో చంద్రబాబును అందరూ ప్రశ్నించారని వీర్రాజు కోరారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 7,200 కోట్లు ఏం చేశావని చంద్రబాబును నిలదీశారు. అనిల్‌కి బంధువంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై బుచ్చయ్యచౌదరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 1996లో లక్ష్మీపార్వతి‌ పార్టీలో ఉండి చంద్రబాబుని బుచ్చయ్య చౌదరి నానాతిట్లూ తిట్టారు. ఆయనలా మేము పార్టీలు మారలేదు. గత 40 ఏళ్లుగా నేను బీజేపీలోనే కొనసాగుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News