సోము వీర్రాజు సారాయి లెక్కలు: లిక్కర్ 50కి అమ్మితే కుటుంబానికి 2 లక్షలు ఆదా
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాము అధికారంలో వచ్చాక మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని ఇటీవల బీజేపీ బహిరంగ సభలో ప్రకటిస్తూ విమర్శలపాలయ్యారు. దీంతో సోమువీర్రాజును కాస్త నెటిజన్లు 'సారాయి వీర్రాజు' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. అయితే నిత్యం ఇలా వార్తల్లో నిలవడమే పనిగా పెట్టుకున్నారో ఏమోగానీ తాజాగా వీర్రాజు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి వస్తే లిక్కర్ను రూ. 70కే విక్రయిస్తామంటూ తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థించుకున్నారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. రూ. 6 బాటిల్ను రూ. 200 లకు అమ్మటాన్ని బీజేపీ ప్రోత్సహించదన్నారు. పేదల కోసం చీప్ లిక్కర్ను రూ. 50 కే అమ్మాలని డిమాండ్ చేశారు. రూ. 50కి చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి ఏడాదికి రూ. 2 లక్షలు మిగులుతాయని లెక్కలు చెప్పారు. తనను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో తనకు తెలుసునని ఎద్దేవా చేశారు.
``నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము మూడు గంటల వరకూ ఏం చేస్తారు?`` అని ప్రశ్నించిన సోము వీర్రాజు.. బీజేపీ ఏ విషయమైనా సమయం, సందర్భంతో మాట్లాడుతోందన్నారు. మరోవైపు.. తాను సారాయి వీర్రాజు కాదు.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజుని అన్నారు. తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెడతామని స్పష్టంచేశారు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సమస్యకు బీజేపీ దగ్గర పరిష్కారం ఉందని వెల్లడించారు.
అంతేకాదు.. విశాఖ మహానగరంలో కేజీహెచ్ ఆస్పత్రి పేరు వెంటనే మార్చాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ''అసలు కింగ్ జార్జ్ ఎవరు... ఇందులో కింగ్ ఎవరు..? జార్జ్ ఎవరు..?'' వెంటనే ఈ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని సోము డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక.. జిన్నా టవర్ పేరు మారుస్తామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరును కూడా మార్చాలన్నారు.
విజయవాడలో ఈనెల 28న జరిగిన భాజపా ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను కోటి ఓట్లతో గెలిపిస్తే.. లిక్కర్ను రూ. 70 కే విక్రయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ మెరుగ్గా ఉంటే రూ. 50 కే విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోము వీర్రాజు వ్యాఖ్యలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.