తెలుగుదేశం ప్రభుత్వం - ఆ పార్టీ నేతలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్ విషయంలో టీడీపీ నేతల అసంతృప్తిలో అర్థం లేదన్నారు. స్వామినాథన్ వంటి వారు కేంద్ర బడ్జెట్ ను ప్రశంసిస్తోంటే టిడిపి నేతలకు మాత్రం అది ఎందుకు నచ్చడం లేదో తెలియడం లేదన్నారు. తాను జగన్ కు ఏజంట్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. జగన్‌తో తనకు సంబంధాలు లేవని అన్నారు. అంతేకాదు... వైసీపీ అవినీతీ పార్టీ అంటూ విమర్శిస్తున్న టీడీపీ ఆ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆకర్షించి వారికి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను తాను ప్రజల దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నానని... బిజెపి కార్యకర్తల అభిప్రాయాలను తాను వెల్లడిస్తున్నానని చెప్పిన ఆయన.. అంతకుమించి తనకు వేరే అజెండా లేదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రయోజనమయ్యేలా అనేక కార్యక్రమాలను తీసుకొన్నట్టు చెప్పారు, నిత్యావసర సరుకుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మోడీ ప్రయత్నించారని చెప్పారు. కానీ - ఏపీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని వీర్రాజు చెప్పారు. ట్రేడర్ ను ప్రోత్సహించేలా పాలన ఉందని సోము వీర్రాజు మండిపడ్డారు.
కాగా టీడీపీపై విమర్శలు చేసినందుకు తన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారని.. ఆ ముట్టడి ప్లాను వెనుక ఎవరున్నారో తనకు తెలుసని ఆయన అన్నారు. ఏపీ పునర్విభజన బిల్లులో ఉన్న అంశాలు బడ్జెట్ లో లేవని టీడీపీ నేతలు అంటున్నారని.. అవి బడ్జెట్లో ఉండవని ఆయన చెప్పారు.