ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. పార్టీని దూకుడుగా ప్రజల్లోకి తీసుకువెళ్లి.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి.. స్వతంత్రంగా బలమైన పార్టీగా తీర్చిదిద్దడానికి బాటలు తీర్చగల సమర్థుడినే అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టాలని భాజపా కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. ప్రస్తుతం విశాఖకు చెందిన కంభంపాటి హరిబాబు భాజపా ఏపీ సారథ్యం నిర్వర్తిస్తున్నారు. కొన్నాళ్ల కిందటి వరకు ఆయనకు ఈ పదవిని పొడిగిస్తారని... ఒక వ్యక్తికి రెండుసార్లు అధ్యక్ష పీఠం ఇవ్వడం అనేది భాజపాలో సాంప్రదాయమే గనుక.. ఆయనే మళ్లీ పగ్గాలు చేపడతారని ప్రచారం జరిగింది. కానీ తాజా లెక్కల్లో ఎట్టి పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడే కావాలని పార్టీ చూస్తున్నదిట.
ప్రధానంగా 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలం పెంచుకోవాలనేది వారి కోరిక. అప్పటికి పొత్తుల సంగతి ఎలా ఉండబోయేటప్పటికీ.. భాజపా మాత్రం.. సొంతంగానే రాష్ట్రమంతటా కూడా పోటీచేసే స్థితిలో ఉండాలని.. వారు కలగంటున్నారు. రాష్ట్ర నాయకులైతే వేర్వేరు సందర్భాల్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ సింగిల్‌గా అధికారంలోకి వస్తుందని కూడా అనేశారు కూడా! అంత మేర బలం సంపాదించుకోవాలంటే.. మెతక నాయకులు అధ్యక్ష స్థానానికి సరిపోరని పార్టీ యాజమాన్యం భావిస్తోంది.
ఏతావతా.. సీఎం నారా చంద్రబాబునాయుడు మీద పెట్రేగిపోవడం ఒక్కటే అర్హతగా తమ పార్టీ రాష్ట్రశాఖ కు సారధిని పెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ రేసులో అయితే ప్రస్తుతానికి సోము వీర్రాజు ముందంజలో ఉన్నారు. బాబు సర్కారును ఆయన తూలనాడినట్లుగా కనీసం ప్రతిపక్షాలు కూడా అనలేకపోతున్నాయి. ఆయన పేరు అధ్యక్ష స్థానం ఆశావహుల జాబితాలో ముందంజలోనే ఉన్నదిట.
అయితే పార్టీలోని కొందరు నాయకులు చెబుతున్నదాన్ని బట్టి.. సోము వీర్రాజు ఢిల్లీలోని పార్టీ పెద్దల ఆశీస్సులు, గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాతే.. ఈ రేంజిలో చంద్రబాబు మీద చెలరేగిపోతున్నాడట. కేవలం ఎమ్మెల్సీగా ఉంటేనే ఇంతగా ఆడిపోసుకుంటున్న ఆయన, ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయితే.. బాబు సర్కారును ఇంకా ఎంత చికాకు పెడతాడో కదా?