అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు! `అడగకుండానే మేం నిధులు ఇస్తున్నాం` అని బీజేపీ నేతలు మరోపక్క చెబుతున్నారు! కేంద్రం ఇవ్వడం లేదా.. ఇచ్చినా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు కేటాయిస్తూ బీజేపీని కార్నర్ చేస్తోందా? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ విషయంపై బీజేపీ నేత - ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎప్పటికప్పుడు టీడీపీ వైఖరిని నిలదీస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉపాధి నిధుల దుర్వినియోగంపై టీడీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. అంతేగాక టీడీపీపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఉపాధి నిధుల్లో అవకతవకలు జరిగాయని, వీటిపై విచారణకు ఆదేశించాలని బీజేపీ పెద్దలను కోరారు.
కేంద్రం ఇస్తున్న నిధులను దారిమళ్లించి ఇతర పనులకు కేటాయించి.. ఏపీకి నిధులు ఇవ్వడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై.. ఏపీ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే! వీరిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముందు వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు టీడీపీని ఎండగడుతూ.. వాస్తవాలు ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉపాధి హమీ పథకం నిధుల దుర్వినియోగంలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఇంతకాలం పాటు పెండింగ్‌లో ఉన్న నిధులు వచ్చాయని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న సమయంలో.. వారి గాలి మొత్తం తీసేశారు.
ఏపీ రాష్ట్రంలో ఉపాధి హమీ పథకం నిధుల దుర్వినియోగం చోటుచేసుకొందని ఇప్పటికే వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఉపాధి హమీ నిధులు రాకుండా నిలిపివేసింది. ఏపీలో ఉపాధి హమీ పనులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నివేదికలు సమర్పించడంతో సోమవారం నాడు నిధులను విడుదల చేసింది. ఏపీకి విడుదలైన ఆనందం టీడీపీ నేతలకు లేకుండా పోయింది. ఉపాధి హమీ పథకం నిధుల దుర్వినియోగం జరిగిందని బీజేపీ సీనియర్ నాయకుడు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
ఉపాధిహామీలో నీరు చెట్టు ద్వారా రూ.9వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతుండటం ఆశ్చర్యమేస్తోందన్నారు. ఈ మొత్తం నిధులనే పోలవరానికి ఖర్చు పెడితే సగం పనులు పూర్తయ్యేవని ఎద్దేవా చేశారు. నీరు-చెట్టు పనులను పరిశీలించాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశానని తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి విచారణకు ఆదేశించారని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ నేతలతో తనను పోల్చవద్దని ఆయన టీడీపీ నేతలకు సూచించారు.