పోలవరం వ్యవహారం ఏపీలో కొత్త రాజకీయాన్ని తెర మీదకు తెచ్చేలా కనిపిస్తోంది. పోలవరం నిర్మాణ పనుల్ని ఆపాలంటూ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాటల్ని తప్పు పట్టిన సోము.. కేంద్రం తెలిపిన అభ్యంతరాల్ని ఏపీ సర్కారే పరిష్కరించుకోవాలన్నారు.
అనవసరమైన రాజకీయాలు చేయకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని బాబును సోము కోరారు. పోలవరంపై కేంద్రం విడుదల చేసిన ఆదేశాలపై బాబు చేసిన వ్యాఖ్యలపై సోము అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తేనే అన్న పదం వాడటం బాగోలేదని.. ఇంతకాలం కేంద్రం సహకరించినందువల్లే ప్రాజెక్టు 60 శాతం పూర్తి అయ్యిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
పోలవరంపై అనవసర గందరగోళాన్ని సృష్టించొద్దని.. ప్రాజెక్టు విషయంలోకమిట్ మెంట్ తో పని చేస్తున్నది బీజేపీ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో పోలవరం ముంపు మండలాల గురించి రాజ్యసభలో మాట్లాడినప్పుడు కూడా బీజేపీ నేతగా ఉన్న సీనియర్ నేత వెంకయ్యనాయుడు మాత్రమే మాట్లాడారని.. అప్పట్లో రాజ్యసభలో ఉన్న ఏపీ టీడీపీ నేతలు సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లు సమన్యాయం అంటూ కిక్కురమనలేదన్నారు. కేంద్రంపై నెపం నెట్టటం మంచిది కాదన్న మాటను చెప్పిన చంద్రబాబు.. సమస్యలను అధ్యయనం చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో చేతకాక తిరిగి ఇచ్చేస్తామన్న మాట మంచిది కాదన్నారు. మొత్తానికి పోలవరం.. పోలరణంగా మారటమేకాదు.. ఏపీలోని అధికారపక్షానికి.. వారి మిత్రపక్షానికి మధ్య దూరం పెంచేలా మారిందని చెప్పక తప్పదు.