బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ - ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోమారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పెట్టే కామెంట్లు చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యలతో - ముఖ్యంగా మంత్రి నితిన్ గడ్కరీ ముందడుగుతో ఏపీ సర్కారు కక్కలేక మింగలేక అనే స్థితిలో ఉండగా....తాజాగా మరోమారు ఏపీ సర్కారు ఇబ్బందిపడే కామెంట్లు చేశారు. పోలవరం విషయంలో బీజేపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సరికాదని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వీర్రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని తేల్చిచెప్పారు.
ఈ సందర్బంగా కాపు రిజర్వేషన్లపై కూడా వీర్రాజు స్పందించారు. కాపు రిజర్వేషన్లపై తమ పార్టీ పరంగా తగు కార్యాచరణ చేపడతామన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీలో చర్చించి అనంతరం కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మాట్లాడతామని సోము వీర్రాజు తెలిపారు. పార్టీ పరంగా తమ వైఖరి సరైన సమయంలో స్పందిస్తామన్నారు.
కాగా, రెండ్రోజుల క్రితం అనంతపురం జిల్లా హిందూపురంలో నిర్వహించిన ‘బీసీ చైతన్య మహాసభ’కు హాజరైన సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ప్రధాని మోడీ రాష్ట్రాలను కబళిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దగ్గర మోకాళ్లు ఒడ్డి, కండువాలు మార్చుకున్న వారు ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం అవినీతికి అవకాశం కల్పించకుండా టెండర్లను 45 రోజుల పాటు ఆన్‌లైన్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా ఎందుకు రాష్ట్రం దాన్ని పాటించలేదని టీడీపీ ప్రజాప్రతినిధులను వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. కాగా, ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేలే పందికొక్కుల్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను గాలికి వదిలి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందన్నారు.