బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత -ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు తనదైన శైలిలో సంచలన కామెంట్లు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని ఏర్పేడులో ఇసుక మాఫియా చెలరేగిపోయిన ఘటనపై వీర్రాజు తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా...ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా కొందరు నాయకులు మాఫియాగా మారిపోయారని వీర్రాజు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికార - ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు ఇసుక దందా చేసే వారు మాఫియాగా ఏర్పడి దోచుకుంటున్నాయని సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ మాఫియా వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అనేక సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సిమెంట్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ సిండికేట్ పై సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కార్టున్లపై, కామెంట్లు చేసినందుకు అరెస్టు చేయడంపై వీర్రాజు స్పందించారు. స్వేచ్ఛ హద్దుమీరడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి కుమారుడిపై కార్టూన్ వేసినందుకు అరెస్ట్ చేసినట్లే...ప్రధానమంత్రి మోడీని అనకొండ అంటూ కార్టూన్ వేసిన పత్రికపై సైతం కేసు పెట్టాలని వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రధాని సన్యాసి అని మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వీర్రాజు కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/