ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉదారంగా లెక్కలు వేసినా.. ముగ్గురు సరైన నాయకులు లేని పార్టీ బీజేపీ. కానీ తగుదునమ్మా అంటూ చంద్రబాబు ప్రభుత్వంలోంచి పక్కకు తప్పుకుంటామనే బెదిరింపు పాట పాడటంలో మాత్రం ఇదేమాత్రం అలసిపోవడం లేదు. ప్రత్యర్థిని బయటనుంచి కాకుండా లోపలినుంచే నరుక్కురావాలనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పంథాను ఆంధ్రలో అమలు చేయడంలో ఆ పార్టీకి చెందిన చిన్న బృందం బాగానే కష్టపడుతున్నట్లుంది. ఆ బృంద మహానేత సోము వీర్రాజు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆంద్రా వ్యతిరేక పాలసీని ముందుకు తీసుకుపోవడంలో ఈయన్ని మించిన వారు రాష్ట్ర బీజేపీలోనే మరొకరు లేకనంటే అతిశయోక్తి కాదు.
అదే సమయంలో ఏపీకి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీలపై బీజేపీ చూపిస్తున్న రిక్తహస్తం రంగు బయటపడకుండా సమర్థించుకు రావడంలో కూడా వీర్రాజుదే పైచేయి. గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా - హిందూపుర్ ఎంఎల్ ఏ బాలకృష్ణలు వేర్వేరు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ తలబిరుసుతనానికి వ్యతిరేకంగా తమ గళం విప్పిన విషయం తెలిసిందే. కాని ఆ సమయంలో కూడా వారిపై విరుచుకుపడి, అవసరమైతే ప్రభుత్వంలోంచే పక్కకు తప్పుకుంటామని బెదిరించిన ఘనుడు వీర్రాజు. ఈ విషయంలో టీడీపీకి హెచ్చరిక లాంటిది కూడా చేశాడీ బీజేపీ నేత.
ప్రభుత్వంలో భాగస్వాములుగా తామెన్ని విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనం పాటిస్తున్నామో గ్రహించాలని వీర్రాజు తెలుగుదేశం నేతలకు గుర్తు చేసారు. కానీ నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే కలిగిన రాష్ట బీజేపీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని, ప్రభుత్వం నుంచి ఒకవేళ వారు బయటకి వచ్చినా అది ఏ ప్రభావమూ వేయలేదని వీర్రాజు గ్రహించడం లేదు. తమను ప్రశ్నించిన వారిపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్న వీరు దానికంటే తమ హై కమాండ్ పై ఒత్తిడి చేసి గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చేలా చేస్తే అది ఉభయతారకంగా ఉంటుందని పరిశీలకుల వ్యాఖ్య. తాము ఏం మాట్లాడిన సరే.. ఎదురు చెప్పలేని దీనస్థితిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నందువల్లనే.. సోము వీర్రాజు ఇలా చెలరేగిపోతున్నారని పలువురు అంటున్నారు.