బాబు మీద మిత్రుడు మ‌ళ్లీ మండిప‌డ్డాడు

Update: 2016-02-23 09:28 GMT
ఫ్రెండ్‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యాన్ని ఏపీ బీజేపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు అండ్ టీమ్ అర్థ‌మ‌య్యేలా చెప్పాల్సిన అవ‌స‌రం ఉందా? అంటే అవున‌నే చెప్పాలి. తాజాగా ఏపీ బీజేపీ నేత‌.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఏపీలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు మండిపోతున్నాయ‌ని.. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు ల‌భించ‌కుండానే.. మార్కెట్లో మాత్రం ధ‌ర‌లు ఎలా మండిపోతున్నాయ‌ని ప్ర‌శ్నించారు. ధ‌ర‌ల నియంత్ర‌ణ కోసం విజిలెన్స్ క‌మిష‌న్ వేయాల‌ని బాబును డిమాండ్ చేసిన ఆయ‌న‌.. ధ‌ర‌ల పెరుగుల విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్య‌మం చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

నిత్య‌వ‌స‌ర వ‌స్తువ‌ల ధ‌ర‌ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన సోము వీర్రాజు.. మార్చి 6న రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో బీజేపీ త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ గురించి చెబుతూ.. బీజేపీ ఏం చేసిందో చెప్ప‌టానికేన‌ని పేర్కొన్నారు. అందుకే సంక‌ల్ప స‌భ పేరుతో ఈ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ధ‌ర‌ల పెరుగుద‌ల కేవ‌లం ఏపీలో మాత్ర‌మే ఉన్న‌ట్లుగా ఫీల‌వుతున్న వీర్రాజు..కాస్త ప‌క్క‌నున్న రాష్ట్రాల్లో కూడా కాస్తంత వాక‌బు చేస్తే బాగుంటుంది. నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు మండిపోవ‌టం అన్న‌ది దేశ వ్యాప్తంగా ఉన్న ఇష్యూ అని.. దానిపై ఉద్య‌మించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని వీర్రాజు గుర్తిస్తే మంచిది. అయినా.. మిత్ర‌ప‌క్షంగా ఉంటూనే ఉద్య‌మం చేసే వీర్రాజు.. ఏపీకి ఇస్తాన‌న్న ప్ర‌త్యేక హోదా గురించి ఎందుకు ఉద్య‌మం చేయ‌ట్లేదు? ఇలాంటి అంశాల మీద స్ప‌ష్ట‌త ఇస్తే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News