విభజన అనంతరం కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ.. బీజేపీని ఇరకాటంలో పడేస్తున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు, ఇతర అంశాల విషయం లో కేంద్రం నుంచి నిధులు వస్తున్నా.. ఆ క్రెడిట్ అంతా బీజేపీకి దక్కకుండా చేస్తున్నారు చంద్రబాబు. అంతేగాక ఏపీలో బీజేపీని అణగదొక్కడానికి కూడా వీలైనంతంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు కొందరు.. బాహాటంగానే విమర్శిస్తున్నారు. వీరిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముందు వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు బాబు మోసాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
సొమ్మొకరిది.. సోకొకరిది.. ఇది ఏపీ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు. మిత్రపక్షంగా ఉన్నా.. సరైన ప్రాధాన్యమివ్వడం లేదనే అసంతృప్తి, ఆగ్రహం వారిలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. బీజేపీపై చంద్రబాబు అనుసరిస్తున్న తీరును నిరంతరం ప్రశ్నిస్తున్న సోము వీర్రాజు.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 2019లో తామే హీరోలం అని సోము వీర్రాజు ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల వరకు కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ ఘనతగా చెప్పుకుంటోందని వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమ కార్యకర్తలకు ఏమీ చేయలేకపో తుండటంతో నిరాశ చెందుతున్నానని అన్నారు. ఇప్పటి వరకూ పోలవరానికి కేంద్రం రూ.6వేల కోట్లు విడుదల చేసిందని, ఇంత చేస్తున్నా సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు అంతా తామే చేసినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ చేస్తున్న ద్రోహాన్ని ఎదుర్కొని, 2019 ఎన్నికల్లో విజేతగా నిలుస్తామని అన్నారు. నెలకోసారి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులన్నీ తమ ప్రభుత్వమే చేస్తున్నట్లు, చంద్రబాబు ఆర్భాటాలకు పోతున్నారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ కేంద్రం రూ.5వేలకోట్లు ఇచ్చిందని, ఇటీవలే మరో రూ.వెయ్యికోట్లు ఇచ్చిందన్నారు. త్వరలో తాము కూడా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి వాస్తవాలు ప్రకటిస్తామన్నారు. కేంద్రం 10 లక్షల ఇళ్లు కేటాయించి దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరుపెడితే, చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ స్వగృహ పేరుతో ఇటీవల గృహప్రవేశాలు చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో కేంద్రానికి సంబంధంలేదనట్లుగా కనీసం బ్యానర్లలో ప్రధాని మోడీ ఫొటోలను పెట్టడం లేదన్నారు.