అందుకే అనేది.. ఎవరి పని వాళ్లు చేసుకోవాలని. బీజేపీని టార్గెట్ చేస్తూ.. ఎక్కడ ఏం జరిగినా సరే.. కమలనాథులకు కరెంటు షాకిచ్చేలా ట్వీట్ చేయటం ఒక అలవాటుగా చేసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు.. ఒక రేంజ్ లో పంచ్ ఇచ్చారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. 'వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్' అంటూ రూ.50లకే చీప్ లిక్కర్ బీజేపీ జాతీయ విధానమా? అధికారం కోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నారా?' అంటూ ట్వీట్ చేసి సోము చేసిన వ్యాఖ్యపై తనదైన శైలిలో కేటీఆర్ స్పందించారు.
తాను అన్న మాటలకు ట్వీట్ తో చురకలు వేసిన మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు సోము వీర్రాజు. నన్ను సారాయి వీర్రాజు అన్న వారు ఏం తాగుతారో నాకు తెలుసు. నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజామున మూడింటి వరకు ఏం చేస్తారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఛీప్ లిక్కర్ ను రూ.75 మరంత ఆదాయం వస్తే రూ.50లకే అందజేస్తామని చెప్పిన ఆయన మాటలు ఎంతటి సంచలనంగా మారాయో తెలిసిందే.
తాను చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యల్ని సమర్థించుకున్న ఆయన.. తాను పేదవాడిని దృష్టిలో పెట్టుకొనే లిక్కర్ మీద మాట్లాడినట్లు చెప్పారు. తాను సారాయి వీర్రాజును కాదని.. బియ్యం వీర్రాజును.. సిమెంట్ వీర్రాజును.. కోడిగుడ్ల వీర్రాజునని వ్యాఖ్యానించారు. ఛీప్ లిక్కర్ ను రూ.50కు అమ్మితే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.2లక్షలు మిగులుతాయని లెక్కలు వేసి మరీ చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. తాను అన్న మాటలు ఏదో యధాలాపంగా మాట్లాడింది కాదని.. తాను చెప్పిన మాటలన్ని 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు చెప్పారు. ఏపీలోని ప్రతి సమస్యకు తన దగ్గర పరిష్కారం ఉందన్న ఆయన.. గుంటూరు జిన్నా టవర్.. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు అధికారంలోకి వచ్చిన తర్వాత తామే మారుస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందే మార్చాలని లేదంటే.. తాము పవర్లోకి వచ్చిన తర్వాత మార్చటం ఖాయమన్నారు. గుంటూరు జిన్నా టవర్ పేరును అబ్దుల్ కలాం టవర్ గా మార్చాలని ప్రతిపాదించిన సోము.. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరును సర్దార్ గౌతు లచ్చన్న పేరును ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
తన ట్వీట్ తో తన తండ్రిని తిట్టించిన మంత్రి కేటీఆర్.. సోము వీర్రాజు ఆగ్రపు పంచ్ కు ఏమని బదులిస్తారో చూడాలి. బీజేపీపై వరుస పెట్టి కత్తి కట్టినట్లుగా విరుచుకుపడటం బాగానే ఉన్నా.. అందులోని అపాయాల్ని సైతం గుర్తిస్తే బాగుంటుందన్న సలహాను కేటీఆర్ కు పలువురు ఇస్తున్నారు. మరేం చేస్తారో చూడాలి.